మేఘాలయ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇకనుంచి ప్రజలు ఇంట్లోనే వైన్ తయారుచేసుకోవచ్చు.. మార్కెట్లో అమ్ముకోవచ్చు కూడా. వైన్ తయారీ వచ్చే వాళ్లకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.
గత రెండు దశాబ్దాలుగా తమ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉన్నదని ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని వైన్మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైఖెల్ మీడియాకు తెలిపారు. స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కాన్రెడ్ కే సంగ్మా మీడియాకు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా మేఘాలయాలో ఈ డిమాండ్ ఉన్నది. దీంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి తలొగ్గాల్సి వచ్చింది. ఇటీవల అక్కడి క్యాబినెట్ ఆమోదించిన ఎజెండాల్లో వైన్తయారీకి అనుమతివ్వడం కూడా ఒకటి. మేఘాలయ ప్రజలు వైన్‌ను ఎంతో ఇష్టపడతారు. ప్రతిఏడాది ఆ రాష్ట్రంలో వైన్ ఫెస్టివల్స్ ఘనంగా నిర్వహిస్తారు.