ఏపీకి గూగుల్ పెద్ద త‌ప్పే చేసిందా?

Update: 2015-07-13 03:53 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య న‌డుస్తున్న పంచాయితీలు స‌రిపోవ‌న్న‌ట్లుగా తాజాగా మ‌రో పంచాయితీ తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న పంచాయితీల‌కు భిన్నంగా.. తెలంగాణ స‌ర్కారు త‌ప్పు చేసిన‌ట్లుగా స్ప‌ష్ట‌మైన ఆధార‌లు చూపిస్తున్నారు ఏపీ ఎమ్మెల్యే.

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు స‌రిహద్దుల్ని తెలంగాణ ప్ర‌భుత్వం మార్చేసింద‌ని గుర‌జాల ఎమ్మెల్యే శ్రీ‌నివాస‌రావు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ పెద్ద త‌ప్పు చేసింద‌ని.. క్ష‌మించ‌రాని నేరం చేసింద‌ని.. గూగుల్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న చెబుతున్నారు.

త‌న వాద‌న‌కు తోడుగా ఆయ‌న మ‌రో విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. స‌ర్వే ఆఫ్ ఇండియాకు చెందిన మ్యాపుల్లో నాగార్జున సాగ‌ర్ స‌రిహ‌ద్దుల్నిస్ప‌ష్టంగా ఉన్నాయ‌ని.. అయితే.. తెలంగాణ‌స‌ర్కారు దూకుడుగా హ‌ద్దుల్ని మార్చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ స‌ర్కారు కానీ.. తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు కానీ స్పందించింది లేదు. మ‌రి.. గుర‌జాల ఎమ్మెల్యే చూపిస్తున్న ఆధారాలు నిజ‌మేనా? కాదా? అన్న‌ది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News