తనను తాను దైవంగా ఫీల్ అవుతూ.. అందరిని అలా నమ్మించే విషయంలో విజయం సాధించిన డేరా బాబా అలియాస్ గుర్మీత్ కు సంబంధించి మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అతగాడి ఆశ్రమాన్ని అధికారులు గడిచిన కొన్ని రోజులుగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. గుర్మీత్ గుట్టుమట్లన్నీ ఒక్కొక్కటిగా బయట పెట్టిన అధికారులు తాజాగా.. అతగాడి కామ కోణాన్ని బయటపెట్టారు.
డేరాబాబాగా అందరికి సుపరిచితుడైన అతడో కామ పిశాచి అని.. వైద్యపరిభాషలో అతన్ని సెక్స్ వ్యసనపరుడని చెబితే సరిపోతుందన్నారు. అత్యాచార కేసు విచారణ సందర్భంగా తనను తాను సెక్స్ కు పనికిరానని చెప్పినప్పటికీ అతడ్ని పరీక్షించిన వైద్యులు మాత్రం.. అతన్ని సెక్స్ వ్యసనపరుడిగా అభివర్ణించటం గమనార్హం. ఈ కారణంతోనే జైల్లోకి వెళ్లిన నాటి నుంచి మూడీగా ఉండటం.. గోడలతో మాట్లాడటం.. భోజనం సరిగా చేయకపోవటం లాంటివి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇన్నాళలు అనుభవించిన సుఖవంతమైన.. విలాసవంతమైన జీవితానికి ఆయన దూరం కావటంతో.. ఆ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా గుర్మీత్ ను పరీక్షించిన వైద్యులు.. అతడికి చికిత్స చేయాలని.. జాప్యం చేసే కొద్దీ సమస్య మరింతగా తీరుతుందని చెబుతున్నారు. సెక్స్ ఔషధాలను ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకునేవాడని.. జైలుకు వచ్చే వరకూ రోజూ ఎనర్జీ డ్రింక్ తాగేవాడట. 1988 వరకు నాన్ వెజ్ కూడా బాగానే లాగించేవాడని చెబుతున్నారు. తర్వాత మాత్రం మానేసినట్లుగా గుర్తించారు.
ఇదిలా ఉంటే.. గుర్మీత్ కు సన్నిహితంగా ఉండే హనీకి సంబంధించి చూస్తే.. ఆమె ఇప్పుడు దేశం విడిచి పారిపోవాలన్న ప్లాన్ లో ఉందని చెబుతున్నారు. దేశాన్ని విడిచి నేపాల్ కు వెళ్లిపోయి.. అక్కడే ఉండిపోవాలని భావిస్తుందట. దేశం విడిచి పారిపోతుందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఆమె ఫోటోను అతికించారు. ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ అయిన ఆమె ఆచూకీ కొన్ని రోజులుగా బయటకు రావటం లేదు. తీర్పు సమయంలో గుర్మీత్ వెంటే ఉన్న ఆమెను.. జైల్లో తనతో పాటు ఉండాలని డేరాబాబా కోరటం తెలిసిందే. దత్త కుమార్తెగా లోకానికి చెప్పుకున్నప్పటికీ.. వారిద్దరి మధ్య రిలేషన్ మాత్రం వేరేనంటూ హనీ ప్రీత్ సింగ్ మాజీ భర్త ఆరోపించటం గమనార్హం.