వివేకా హత్య కేసు సీబీఐ కి అప్పగించండి ..సిట్ పై నమ్మకం లేదన్న మాజీ మంత్రి !

Update: 2020-01-02 06:55 GMT
గత ఏడాది మార్చి 15న మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య రాష్ట్రం లో పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసుపై ఏర్పాటైన సిట్ ఇప్పటికే అనేక మందిని విచారించింది. అయితే , సిట్ విచారణ పై అనుమానం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ కేసును సీబీఐ లేక రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ తో దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇప్పటికే ఈ కేసు లో ఆయన సిట్ విచారణ ఎదుర్కొన్నారు. హత్య జరిగిన సమయంలో తాను విజయవాడ లో ఉన్నానని..తనకు హత్యతో ప్రమేయం ఉన్నట్లుగా తేలితే తనను ఎన్ కౌంటర్ చేయాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇదే అంశం పైన హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ పైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు. సిట్ వైఖరి చూస్తూ అమాయకుల్ని కేసులో ఇరికించేలా ఉందని అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని, అందువల్ల వివేకా హత్య కేసును సీబీఐ లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ తో దర్యాప్తు చేయించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.

ఈ కేసు పైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పైన ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ పైన సీల్డ్ కవర్ ల్ నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిట్ కు సూచించింది. వివేకా హత్య కేసు విచారిస్తున్న సిట్ బీటెక్ రవిని సైతం విచారించింది. హత్య జరిగిన సమయంలో కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని కోరిన వారు..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు సీబీఐకు ఇవ్వటం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనితో గురువారం మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..


Tags:    

Similar News