ఒక తరం తరమే ప్రస్తుతం సాంకేతిక యుగం మరియు సోషల్ మీడియా ప్రభావానికి గురైపోయింది. వ్యక్తిగత ఆనందాన్ని - అబిరుచులను ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వెతుక్కుంటున్న, షేర్ చేసుకుంటున్న తరానికి నిజమైన ఆనందం ఏమిటో తెలియనంత అజ్ఞానంలోకి దిగజారిపోయారని సర్వేలు చెబుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాకు ఎంతగా బానిసలైతే అంతగా జీవితానందాన్ని కోల్పోతున్నారని తాజా సర్వే ఢంకా భజాయించి మరీ ప్రకటిస్తోంది. మరీ ముఖ్యంగా ఫేస్ బుక్ ను అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు ఆనందానికి పూర్తిగా దూరం అవుతున్నారని సర్వే తేల్చి చెప్పింది.
హ్యాపీనెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హెచ్ ఆర్ ఐ) నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం ఒక వారంపాటు సోషల్ మీడియాకు దూరమైనవారు, దాన్ని నిరంతరం ఉపయోగిస్తున్న వారికంటే సంతోషంగా గడుపుతున్నారట. ఈ పరిశోధన కోసం వెయ్యిమందిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ ఫేస్ బుక్ ఉపయోగించనిది. మరొకటి ఫేస్ బుక్ ఇపయోగించేది. అంతిమ పలితాను సర్వే నిర్వాహకులనే నివ్వెరపరిచాయి. ఫేస్ బుక్ ఉపయోగించనివారే సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని సర్వే నిర్ధారించింది.
ఈ పరిశోధనకు ఫేస్ బుక్ ని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారు అని హెచ్ ఆర్ ఐ చీఫ్ ఎక్జిక్యూటివ్ ని ప్రశ్నించగా, దాదాపు అన్ని వయస్సుల వారు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఫేస్ బుక్ మాత్రమే కాబట్టి కచ్చితమైన నిర్ధారణలకు అది మాత్రమే ఉపయోగపడుతుందని సమాధానమిచ్చారు.