ఏపీలో రాజకీయం నెమ్మదిగా వేడెక్కుతోంది. ఇంకా చెప్పాలీ అంటే ఎన్నికల కాక మెల్లగా మొదలవుతోంది. ఏపీలో విపక్షాలు కూడా ఇపుడిపుడే సీరియస్ గా రాజకీయాల మీద అటెన్షన్ పెడుతున్నారు. ప్రస్తుతం 2022 నడుస్తోంది. గట్టిగా చెప్పుకుంటే 2023 ఒక్క ఏడాది మాత్రమే ఎవరికైనా మిగిలి ఉంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అంటే గేర్ మార్చి స్పీడ్ పెంచాలీ అంటే సరైన సమయం ఈ మధ్య కాలమే. అందుకే అన్ని పార్టీలూ తొందరపడుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ కూడా సరైన ముహూర్తాన్ని ఎంచుకుంది.
వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని పెద్ద ఎత్తున జూలైలో నిర్వహించాలని చూస్తున్నారు. జూలై 8వ తేదీ వైఎస్సార్ జయంతి. ఆ రోజున పార్టీ ప్లీనరీని అంగరంగ వైభవంగా నిర్వహించాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఆనాటికి కచ్చితంగా మూడేళ్ళు పూర్తి అవుతుంది. అదే టైమ్ లో పార్టీ అధికారంలో ఉండగా ప్లీనరీ నిర్వహించడం కూడా ఫస్ట్ టైమ్ అవుతుంది.
వైసీపీ అధికారం చేపట్టాక ఇప్పటిదాకా ప్లీనరీ నిర్వహించలేదు. 2019 ఎన్నికలలో గెలిచిన వచ్చిన సందడితో సరిపోయింది. 2020, 2021లలో కరోనా కారణంగా ప్లీనరీని వాయిదా వేశారు. ఇక ఇపుడు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్లీనరీ జరపాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోందిట.
నిజం చెప్పాలంటే వైసీపీ ప్లీనరీ చివరి సారిగా 207లో జరిగింది. ఆనాడే జగన్ మహా పాదయాత్రకు ప్లీనరీలో తీర్మానం చేశారు. 2019 జనవరి దాకా జగన్ పాదయాత్ర చేయడంతో మధ్యలో ప్లీనరీ అన్న ఊసే లేకుండా పోయింది. మొత్తానికి చూస్తే అయిదేళ్ళ పాటు ప్లీనరీ అన్నది లేకుండా వైసీపీ నెట్టుకువస్తోంది. అదే టైమ్ లో పార్టీలో గొడవలు బాగా ఎక్కువ అయ్యాయని ప్రచారం సాగుతోంది.
ఇక వర్గ పోరు హెచ్చు స్థాయిలోనే ఉంది. ప్రతీ నియోజకవర్గంలో గ్రూపులుగా నేతలు విడిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వాతావరణం ఉంది ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది. అలాగే మంత్రులు కూడా పార్టీని పక్కన పెట్టేసారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో పార్టీని ప్రక్షాళన చేయకుండా 2024లో ఎన్నికలకు వెళ్లడం అంటే అది ఓటమికి ఒప్పుకోవడమే అవుతుంది.
దాంతో ప్లీనరీని ఘనంగా నిర్వహించి మొత్తం 175 నియోజకవర్గాల్లో కొత్త కార్యవర్గాలను నియమించాలని జగన్ చూస్తున్నారు అంటున్నారు. అలాగే ఇక మీదట ప్రతీ శని, ఆదివారాల్లో పార్టీకే సమయం పూర్తిగా కేటాయించాలని, నియోజకవర్గాల నేతలతో భేటీలు పెట్టి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్లీనరీ అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. దాన్ని గ్రాడ్ లెవెల్ లో నిర్వహిచడం మీద అందరి దృష్టి ఉంది. అలాగే పార్టీ వైపు పెద్దల చూపు పడడం మీద టాక్ నడుస్తోంది.