కేటీఆర్ నంబర్ 2 కాదు..నంబర్ 1000 వరకు కేసీఆరే

Update: 2017-04-25 07:05 GMT
తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ ఒక్కరే నాయకుడని ఆయన మేనల్లుడు - మంత్రి హరీశ్ రావు చెప్పారు. పార్టీలో ఒకటి నుంచి 1000వ స్థానం వరకూ కేసీఆర్ దేనని అన్నారు.  మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో టిఆర్ ఎస్ పాలను ఉంటుందన్నారు. విపక్షాల ఆరోపణలను పట్టించుకోనవసరం లేదని, కేవలం తమ ఉనికి కోసమే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని హరీష్ అన్నారు.
    
టీఆర్ ఎస్ పార్టీలో నెంబర్ టూ ఎవరనే ప్రశ్నకు స్థానమే లేదని ఆయన అన్నారు.  ఒకటి నుంచి వెయ్యి స్థానాల వరకు కేసీఆరే ఉంటారని చెప్పారు. వరంగల్ లో 27న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఆయన ఈ రోజు పరిశీలించారు. ఆ సదర్భంగా మాట్లాడుతూ   కేసీఆర్ పాలన పట్ల ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని...ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగిస్తున్నామని చెప్పారు.
    
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీలు తమకు ఏమాత్రం పోటీ ఇవ్వలేవని చెప్పారు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికే విపక్షాలు టీఆర్ ఎస్ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. బహిరంగసభ సందర్భంగా కేవలం అనుమతి ఉన్న చోట మాత్రమే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా పార్టీలో కేటీఆర్ - హరీశ్ మధ్య పొరపాచ్చాలు ఉన్నాయని... నంబర్ 2 స్థానం కోసం పోరు జరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో హరీశ్ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News