‘ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలోనూ చెల్లదు.. అలాగే ఏపీలో ప్రజలను నిలువునా ముంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బాబు తెలంగాణలో ప్రజలకు నచ్చుతాడా’’ అని మండిపడ్డారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.. తెలంగాణ భవన్ లో గురువారం విలేకరులతో మాట్లాడిన హరీష్ రావు.. టీడీపీ అధినేతపై నిప్పులు కురిపించారు. తెలంగాణలో రాహుల్ తో కలిసి పాల్గొన్న సభల్లో కేసీఆర్ హామీలు అమలు చేయలేదన్న బాబు మాటలను హరీష్ రావు ఖండించారు. కేసీఆర్ మేనిఫెస్టో పెట్టిన 99శాతం హామీలను నెరవేర్చాడని.. హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నాడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాబు మేనిఫెస్టోను బయటకు తీసి తూర్పార పట్టారు.
చంద్రబాబు ప్రజలకు 2014లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయలేదని ఆధారాలతో సహా వివరించారు. ఏపీలో రైతులకు రుణమఫీ చేయకపోవడంతో వారంతా రోడ్డున పడ్డారని వివరించారు. ఏపీలో డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్న బాబు.. కనీసం వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు. అంతేకాదు ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇదే చంద్రబాబు పాలనపై ఏపీలో విడుదల చేసిన చార్జీషీట్ ను మీడియా ముందు బయటపెట్టి కాంగ్రెస్-టీడీపీ అపవిత్రబంధాన్ని ఎండగట్టారు. ఏపీలో హామీలు అమలు కావడం లేదని.. కాంగ్రెస్ పార్టీ వారం రోజుల పాటు ‘ప్రజావంచన వారం ’తో చేసిన దీక్షల మాటేమిటి అని హరీష్ ప్రశ్నించారు.
ఏపీలో కాంగ్రెస్ కు నచ్చని చంద్రబాబు.. తెలంగాణ కాంగ్రెస్ కు ఎలా నచ్చాలో రాహుల్ సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వని బాబును నిరుద్యోగులు నిలదీస్తున్నారని.. రైతులు ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఏపీలో హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తర్వాతే చంద్రబాబు తెలంగాణలో తిరగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు..
2004 - 2009లో కాంగ్రెస్ - అంతకుముందు టీడీపీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఆ మేనిఫెస్టోలను బయటకు తీసి మరి అందులో నెరవేర్చని హామీలను మీడియా ముందు చదివి వినిపించారు. కాంగ్రెస్ - టీడీపీలది ప్రజా కూటమి కాదని.. దగాకూటమి అని విమర్శించారు. మహాకూటమిలో కనీసం టికెట్ తెచ్చుకోని కోదండరాం తమ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని హరీష్ ఎద్దేవా చేశారు.
ఇక 2014లో మోడీతో పొత్తు చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారని... ఇప్పుడు 2018లో రాహుల్ తో పొత్తు చారిత్రక అవసరమని బాబు అంటున్నాడని.. ఇది చారిత్రక అవసరం కాదని.. ఆయన అవసరమని హరీష్ రావు మండిపడ్డారు. తొలుత జన్మనిచ్చిన కాంగ్రెస్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని..ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తన అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది అని హరీష్ ఎద్దేవా చేశారు.