నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆయన రాహుల్ గాంధీతో పాటు పలు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పాలన సరిగా లేదని కేసీఆర్ పై విమర్శలు చేశారు. దీనిపై టీఆర్ ఎస్ నేత - మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్లతో బాబుకు జవాబిచ్చారు. అసలు బాబుకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదంటూ నిప్పులు చెరిగారు.
తెలంగాణ పాలన గురించి బాబు ప్రశ్నిస్తుంటే... నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అసలు ఏపీలో ఇచ్చిన హామీలను ఆయన ఎంత వరకు అమలు చేశారు? ప‌్రజలకు వివరించి ఆ తర్వాత తెలంగాణ గురించి ఆలోచించాలని అన్నారు. రుణమాఫీ చేస్తానని రైతుకు టోకరా వేశారు. ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారు. ప్రాణహిత- చేవెళ్లతో తెలంగాణ పొలాలు పచ్చబడతాయి. దానిని అడ్డుకోవడానికి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. 2007లో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆ ప్రాజెక్టు డిజైన్ చేశారు. మేము 37 లక్షల ఎకరాలకు పెంచడం వల్ల బడ్జెట్ పెరిగింది. ప్రజలకు విషయాన్ని దాచిపెట్టి విషం చిమ్మాలని చూస్తున్నారు అని ఆయన బాబుపై విమర్శలు చేవారు.
తన పాలన తాను చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని కూల్చాలని చంద్రబాబు విఫలయత్నం చేశారు. 2014లో బీజేపీతో పొత్తు చారిత్రక అవసరమట. ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు చారిత్రక అవసరమట. స్వల్పకాలంలోనే ఇన్ని మాటలు మారిస్తే... అసలు ఆయన 40 ఏళ్ల సీనియారిటీలో ఎన్నిమాటలు మార్చి ఉంటాడో ఎవరికి మాత్రం అర్థం కాదు?
ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది బాబే
హైకోర్టును అడ్డుకుంటున్నది బాబే
ప్రభుత్వాన్ని కూల్చాలని చూసింది కూడా బాబే
అని హరీష్ రావు నిప్పులు చెరిగారు.
అది మహాకూటమి కాదు, దగా కూటమి. ఏపీలో చెల్లని రూపాయి, తెలంగాణలో చెల్లుతుందా? అసలు బాబుకు ఏపీలో జనంలో మర్యాద లేదు. అన్నింటా విఫలమయ్యాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ను బాగుచేయని బాబు - అక్కడి హామీలను నెరవేర్చని బాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడని ప్రశ్నించారు. రైతులు రోడ్డున పడ్డారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని గాలికి వదిలేశాడు. బాబు వస్తే జాబు వస్తుందని... ఇంటికో ఉద్యోగం హామీనే ఇవ్వలేదని ప్లేటు ఫిరాయించాడు. 600 హామీలిస్తే పది కూడా నెరవేర్చలేదు. ఇపుడు వచ్చి తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ట్రై చేస్తున్నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్.