తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత - మంత్రి హరీశ్ రావు ఇటీవల తన సహజ శైలి అయిన దూకుడుకు భిన్నంగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కీలక అంశం ఏదైనా స్పందించే హరీశ్ అందుకు భిన్నంగా..తనకు అప్పగించిన ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ కాలం గడిపేస్తున్నారు. అలా తన పని తాను చేసుకుపోతున్న హరీశ్ రావు తాజాగా హర్టయ్యారు. అందుకే మీడియా ముందుకు వచ్చిన హరీశ్ తనను ఎవరు హర్ట్ చేశారు చెప్పారు. ఆయన్ను హర్ట్ చేసింది ఎవరంటే... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఔను. ప్రదాని హర్ట్ చేశారని తాజాగా ఆయన వెల్లడించారు.
ఇంతకీ ప్రధాని హరీశ్ రావును ఎలా హర్ట్ చేశారు..ఎప్పుడు హర్ట్ చేశారంటే తాజాగా జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా జరిగని పరిణామాలపై తాజాగా హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడమంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ తీర్మాణం చేశారు. ఈ తీర్మాణం చేసేటప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతదని ఏ మాత్రం ఆలోచించలేదు. తెలంగాణను నాశనం - అన్యాయం చేసి ఏపీకి మేలు చేస్తామన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. ఆవిశ్వాస చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వింటే ఎవరికైన బాధ కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల మీద ప్రధాని నరేంద్రమోడీకి ప్రేమ లేదన్నారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం - సీఎం కేసీఆర్ ఎంతో పరిణితితో వ్యవహరించారని ప్రశంసించారు. దీనికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేశామని చెప్పారు. తెలంగాణ పట్ల ప్రధాని మోడీకి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టత ఇవ్వలేదన్నారు. విభజన గురించి ప్రధాని మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయన్నారు. తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చడంతో మా గుండెలను మరొక్కసారి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం చర్చ జరిగినప్పుడు తెలంగాణ గురించి ప్రధాని ఒక మంచి మాట కూడా చెప్పలేదు.. చెపుతారేమోనని ఆశించాం కానీ నిరాశే ఎదురైందన్నారు. తెలంగాణకు న్యాయబద్ధంగా - చట్టబద్ధంగా రావాల్సిన అంశాలపై మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ అడిగారన్నారు. హైకోర్టు విభజన - జాతీయ ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు వీటిలో ఏ ఒక్కటైన చెబుతారని ఆశిస్తే ఒక దానిపై కూడా ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు గల్ల జయదేవ్ మాటలు బాధ కలిగించాయని రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన మాటలకు బాధ కలిగించాయా.. ? తెలంగాణను వ్యతిరేకించినందుకు బాధ కలిగాయా..? తెలంగాణ ప్రజల బాధలు మీకెందుకు బాధ కలిగించడం లేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గోస రాహుల్ గాంధీకి పట్టదా..? విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు రెండు కూడ బలుక్కుని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. ఆనాడు రాత్రికిరాత్రే ఏడు మండలాలు తీసుకపోయి ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల - ప్రజల పట్ల ఏ మాత్రం శ్రద్ధ - కనికరం లేదన్న విషయం పార్లమెంట్ లో జరిగినటువంటి అవిశ్వాస తీర్మాణం - సీడబ్ల్యూసీ సమావేశంలో స్పష్టమైందని హరీశ్ రావు అన్నారు. పార్లమెంట్ లో జరిగినటువంటి అవిశ్వాస తీర్మాణం మీద జరిగిన చర్చ - కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈ రెండు చూస్తా..ఉంటే ఒక విషయంలో స్పష్టం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా రెండు జాతీయ పార్టీల విషయంలో క్లారిటీ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ - టీఆర్ ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని మరొక్కసారి కళ్లకు కట్టినట్లుగా పార్లమెంట్ వేదికగా స్పష్టమైందన్నారు.