మామలా మెంటైన్ చేయలేనంటున్న హరీశ్

Update: 2017-04-03 13:39 GMT
కేసీఆర్, హరీశ్ రావు.. దేశ రాజకీయాల్లో పాపులర్ మామాఅల్లుళ్లు వీరు. జోడెద్దుల్లా ఉద్యమాన్ని, ఇప్పడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించడంలో మంచి సమన్వయం ఉన్న ఆత్మబంధువులు, కేసీఆర్ అంటే హరీశ్ కు తిరుగులేని గురి.. ఏం చెప్పినా అది అమలు చేసి చూపిస్తాడు.. అల్లుడు హరీశ్ అంటే కేసీఆర్ కూ అంతే నమ్మకం.. ఏం చెప్పినా సాధించి చూపిస్తాడన్న భరోసా. హరీశ్ కు బాధ్యత అప్పగిస్తే కేసీఆర్ కు కంటి నిండా నిద్ర పడుతుందని చెబుతుంటారు. అలాంటి హరీశ్ చాలా విషయాల్లో మామను ఫాలో అవుతుంటారట.. కానీ, మామలా మెంటైన్ చేయడం మన వల్ల కాదంటున్నారాయన. ఇంతకీ ఆ మెంటైన్ చేయడమేంటో తెలుసా.. ? ఫిజిక్.. దశాబ్దాలుగా లావెక్కకుండా, బరువు పెరగకుండా ఒకేలా ఉండడం కేసీఆర్ కే సాధ్యమైందని.. తన వల్ల కావడం లేదని చెబుతున్నాడు హరీశ్.
     
తనకు దుస్తుల విషయంలో కేసీఆరే ఆదర్శమని.. ప్రజాజీవితంలో ఉన్నాను కాబట్టి ఆయనలాగానే తెల్ల దుస్తులే వేసుకుంటున్నానని చెబుతున్నారు హరీశ్.  30 ఏళ్లనుంచి ఒకే తరహా డ్రస్సులు వాడుతున్నారు.. 30 ఏళ్లనుంచి ఆయన కొలతలు కూడా మారలేదు.. ఆయనలా మేము మెయింటైన్‌ చేయలేకపోయినా వారు చూపించిన పద్ధతులు, నేర్పించిన అలవాట్ల ప్రకారం నడుచుకుంటున్నామని మామ గురించి చెప్పుకొచ్చాడు హరీశ్.
    
ఇంట్లో పిల్లల బాధ్యత అంతా తన భార్యే చూసుకుంటుందని .. వారి ఎడ్యుకేషన్‌ వ్యవహారాలన్నీ ఆమె చూసుకోవడంవల్లే నేను ప్రజా సేవకు ఇంత సమయం కేటాయించగలిగానని హరీశ్ అంటున్నారు.  విరామం లేకుండా రోజంతా తిరిగి.. ఇంటికి టైం కేటాయించకుండా అర్ధరాత్రికి వస్తే విసుక్కున్న సందర్భాలున్నాయని... కానీ.. పరిస్థితులు అర్థం చేసుకుని, ఇంతకు మించి చేయగలిగిందేమీ లేదని సహకరించే దశకు తను వచ్చేశారంటూ తన రాజకీయ జీవితంలో సతీమణి సహకారం గురించి హరీశ్ చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా ప్రత్యర్థులు విమర్శలు చేయడం వల్ల ఇంట్లోనూ మూడ్ ఆఫ్ గా ఉంటే తనే ధైర్యం చెబుతుందని హరీశ్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News