ఎన్నికల వేళ రాజకీయాలు ఎంత ఆగమాగంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయం కొత్త రూట్లో ప్రయాణిస్తోంది. ఎవరికి వారు చెప్పే మాటల్ని వింటే.. అందరూ నిజాలే చెబుతున్నట్లుగా అనిపించేంత నమ్మకంగా చెబుతున్న పరిస్థితి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి వ్యాఖ్యలు ఇంచుమించు ఇదే రీతిలో ఉన్నాయి.
కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ మొత్తాన్ని టార్గెట్ చేసేలా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఓయూ కేంద్రంగా రాజకీయం చేసి తన పట్టును పెంచుకోవాలన్న ప్రయత్నం చేసి.. కేసీఆర్ కరకు రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో స్వయంగా అనుభవించిన ఘన చరిత్ర వంటేరుది. ఓయూ కేంద్రంగా చేసుకొని రాజకీయం చేయాలని తలచిన ఆయనపై పెద్ద ఎత్తున కేసులు పెట్టించిన కేసీఆర్.. ఆయన దీర్ఘకాలం జైల్లో ఉండేలా చేశారన్న ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది.
కేసీఆర్ ను ఓడించటమే తన ధ్యేయమన్నట్లుగా చెప్పే వంటేరు.. ఇప్పుడాయనపై పోటీ చేసేందుకు రెఢీ అవుతున్నారు. ప్రత్యర్థిని దెబ్బ తీసే క్రమంలో మసాలా దట్టించిన ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఆరోపణల్నే చేశారు వంటేరు. తెలంగాణ రాజకీయంలో సంచలనంగా మారిన వంటేరు వ్యాఖ్యల్లో అసలేముంది? ఆయన ఏమన్నారు? వంటేరు వ్యాఖ్యలకు హరీశ్ అంత తీవ్రస్థాయిలో ఎందుకు రియాక్ట్ అయ్యారు? అన్న ప్రశ్నలకు సమాధానాలకు వంటేరు వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.ఇంతకీ ఆయనేం అన్నారంటే..
+ ‘‘హరీశ్ రావు నిన్న రాత్రి ప్రైవేట్ నంబరు నుంచి నాకు ఫోన్ చేశారు. మా మామను ఓడించు.. నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సహాయం చేస్తా అని అన్నారు. ఆయన రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారు.
+ ‘‘మా మామ ఉంటే నాకు రాజకీయ జీవితం లేకుండా అవుతుంది. ఆయన కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నడు. నా ఇజ్జత్ తీస్తున్నడు. తెలంగాణ కోసం 14 ఏళ్లు కష్టపడ్డా. ఇవ్వాళ అధికారం చేతికొచ్చినాక మా బామ్మర్దిని పెడుతున్నడు. ప్రతాప్.. మా మామను ఓడగొట్టు. వాళ్ల చరిత్ర బంద్ అయిపోతది. వాళ్ల కుటుంబం వెనకకు పోతది. నేను నీతో కలిసి పని చేస్తానని హరీశ్ అన్నారు.
+ ఇది నిజం. ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా. టీఆర్ ఎస్ లో ఇంటి పోరు మొదలైంది. మామాఅల్లుళ్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. కేసీఆర్ గెంటేస్తే హరీశ్ కు కాంగ్రెస్సే హరీశ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. హరీశ్ నాతోపాటు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారన్నారు.
+ ‘‘నిన్న గాక మొన్న రాహుల్ తో మాట్లాడారు. డిసెంబరు 11 తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో వస్తానన్నారు. సీఎం పదవి ఇవ్వాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసే ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
+ నా దగ్గర డబ్బులు లేకపోయినా యువకులు - ప్రజలు - గజ్వేల్ అంతా నా వెంటే ఉంది. బీరు - బిర్యానీ పెట్టకపోయినా ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో నాకు 65 శాతం అనుకూలంగా ఉందని సర్వే ఫలితాలు వచ్చాయి.