గడిచిన రెండు రోజులుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం కేసీఆర్ మేనల్లుడు కమ్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తాజాగా ఆయన సిద్దిపేట కలెక్టరేట్ లో నూతన జడ్పీ పాలక వర్గం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. జెడ్పీ ఛైర్ పర్సన్ గా వేలేటి రోజా శర్మతో పాటు మిగిలిన సభ్యులందరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కొత్త ప్రజాప్రతినిధులకు తన అనుభవ పాఠాల్ని చెప్పారు.
కొత్త జిల్లాలో తొలి జెడ్పీ పాలక వర్గంగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పిన హరీశ్.. సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. హెడ్ లైన్ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టొద్దంటూ హితవు పలికారు. ఈసారి జిల్లాకు మంచి జెడ్పీటీసీలు.. పాలక వర్గం వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాలన ఎలా చేయాలన్న విషయంపై సూచనలు ఇచ్చిన ఆయన.. అధికారులతో సామరస్య పూర్వకంగా ప్రేమతో పనులు చేయించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. స్థాయి ఏదైనా మనమంతా ప్రజాసేవకులమన్నారు.
నేను అన్న పద్దతిలో కాకుండా మేము అనే పద్దతిలో పని చేయాలని.. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకున్న వారు గొప్పవారు అవుతారన్నారు. ఏమైనా అనుభవంతో చెబుతున్న హరీశ్ మాటలు కొత్త నేతలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పక తప్పదు. బుద్దిగా బడి పిల్లల మాదిరి హరీశ్ చెప్పిన మాటల్ని శ్రద్ధగా విన్న ప్రజాప్రతినిధులు ప్రాక్టికల్ గా ఎలా అమలు చేస్తారో చూడాలి.