షూట్ కోసం సింగర్ ను తీసుకెళ్లారు కట్ చేస్తే శవం కూడా దొరకలేదు

Update: 2022-05-24 14:30 GMT
దాదాపుగా రెండు వారాల నుంచి కనిపించకుండా పోయిన హరియాణ సింగర్ సంగీత ఆచూకీ లభించింది. అయ్యో అనిపించేలా మారిన ఆమె ఉదంతం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మే 11 నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. తాజాగా బూడిద కుప్పలా మారిన వైనం షాకింగ్ గా మారింది. ఢిల్లీలో నివసించే సింగర్ సంగీత మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు.. జరిగిన దారుణం గురించి వెల్లడించారు.

పాట షూట్ కోసం మే 11న బయటకు వెళ్లారు. ఆమెతో పని చేస్తున్న రవి.. రోహిత్ లు ఆమెను కిడ్నాప్ చేసినట్లుగా చెబుతున్నారు. సాంగ్ షూట్ కోసం మెహమ్ లోని భీవాని ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

అనంతరం వారు అక్కడే ఉన్న ఒక హోటల్లో భోజనం చేసినట్లుగా సీసీ కెమేరాల్లో గుర్తించారు.  దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు ఆమె విషాద ఉదంతం వెలుగు చూసింది.

భైరాన్ బైనీ ప్రాంతంలోని ఒక ఫ్లైఓవర్ సమీపంలో ఒక గుర్తు తెలియని డెడ్ బాడీని కాల్చేసిన వైనాన్ని గుర్తించిన పోలీసులు.. పోలీసులు శవపరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆధారాల్ని చూస్తే.. ఆ డెడ్ బాడీ మిస్ అయిన గాయని సంగీతదిగా గుర్తించారు.

ఇదంతా చూస్తే.. గాయనిని షూట్ కోసం వెంట తీసుకెళ్లిన వారిదే ఈ దారుణ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలింపులు చేపట్టారు. విచారణలో కానీ సింగర్ ను అంత దారుణంగా ఎందుకు చంపిన వైనం బయటకు వస్తుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News