నిండా మునిగాక కానీ చలి తీవ్రత తెలియలేదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. ప్రస్తుతం తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో ఇదే వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తు వద్దు.. ఓడిపోతామని గొంతు చించుకున్నా అధిష్టానం వినలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాపోయారు.
గాంధీభవన్ లో కాంగ్రెస్ పరిశీలకులు కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ సీనియర్ల సమావేశంలో హాట్ హాట్ చర్చ జరిగింది. అందరి నోటా అదే మాట వినపడింది. ఓటమికి పొత్తే కారణమని.. టీడీపీయే ముంచిందని ఏకగ్రీవంగా తప్పును ఒప్పేసుకున్నారు.
అందుకే ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక పొత్తుల ప్రస్తావన తేకుండా ఒంటరిగా పోటీచేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. గడిచిన ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తే కాంగ్రెస్ కు కనీసం 45 సీట్ల వరకు వచ్చేవని.. ఇంత ఘోర ఓటమి మిగిలేది కాదని కోమటిరెడ్డి విశ్లేషించారు. కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబుదే పెత్తనమన్న విషయాన్ని కేసీఆర్ జనంలోకి బాగా తీసుకెళ్లాడని.. దానివల్లే నష్టపోయామని కోమటిరెడ్డి విశ్లేషించారు. ఇప్పటికైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ధామని కాంగ్రెస్ ముఖ్యులు డిసైడ్ అయ్యారు.
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కానీ అధికారంలో ఉన్న పార్టీకే తర్వాతి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో గులాబీ గుభేళింపే తథ్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏమేరకు పుంజుకుంటుందనే దానిపై అందరి చూపు నెలకొంది.
Full View