అద్భుతం. మనిషి సాధించిన సాంకేతిక విజయంగా దీన్ని చెప్పాలి. కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుడి ఉపరితలం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటివరకు నలుపు.. తెలుపు చిత్రాల్లో చూడటమే కానీ.. కలర్ ఫుల్ గా చూసింది లేదు. తాజాగా ఆ అరుదైన అవకాశాన్ని కల్పించింది నాసా. 2020లో ప్రయోగించిన అమెరికావ్యోమనౌక పర్సెవరెన్స్ అంగారకుడి మీద దిగిన వెంటనే తన పని మొదలు పెట్టింది. అద్భుతమైన ఫోటోల్ని పంపింది.
ల్యాండింగ్ కు సంబంధించిన సంక్లిష్టమైన ప్రక్రియను అతి దగ్గరగా ఫోటోలు తీయటమే కాదు.. అంగారకుడి ఉపరితలం ఎలా ఉంటుందన్న ఉత్కంటకు తెర దించేలా ఫోటోలు పంపింది. నాసా ప్రయోగించిన వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమేరాలు.. రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిల్లోని పలు కెమెరాలను ల్యాండింగ్ సమయంలోనే ఆన్ అయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.
రానున్న రోజుల్లో మరిన్ని ఫోటోల్ని నాసా విడుదల చేయనుంది. నాసా విడుదల చేసిన ఫోటోలో రోవర్ చక్రం.. రంధ్రాల మయంగా ఉన్న కొన్ని రాళ్లు బంగారు రంగులో కనిపించాయి. అయితే.. ఇదంతా వెలుగు పడటంతో ఇలాంటి వర్ణంలో కనిపిస్తున్నాయని చెప్పాలి. రంధ్రాల మయంగా కనిపిస్తునన ఈ రాళ్లలో కొన్నింటిని రోవర్ యంత్రం.. కొద్దిరోజుల తర్వాత భూమికి పంపనుంది.
తాజా ప్రయోగం ద్వారా.. అంగారకుడి మీద ఎప్పుడైనా జీవం ఉందా? అన్న పరీక్షలు జరపనున్నారు. తాజాగా ల్యాండ్ అయిన ప్రాంతంలో వందల కోట్ల ఏళ్ల క్రితం నది ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. అంగారకుడి మీద సేఫ్ గా ల్యాండ్ చేసిన రోవర్.. ముందుకు కదలటానికి కనీసం వారం పడుతుందని చెబుతున్నారు. రోవర్ లోని అన్ని వ్యవస్థలు బాగా పని చేస్తున్నట్లుగా నాసా ప్రకటించింది. ఏమైనా కోట్లాది కిలోమీటర్ల ఆవల ఉన్న అరుణగ్రహం ఉపరితలం ఎలా ఉంటుందన్న విషయాన్ని నాసా పుణ్యమా అని.. చూడగలుగుతున్నామని చెప్పక తప్పదు.