బెల్లం చుట్టే ఈగలు.. ఇప్పుడు అధికారం చుట్టే నాయకులు.. ఈ సామెత రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తొలి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేబినెట్ లో మంత్రి ఆయన. అప్పుడు ఆయన చెలాయించిన ఆదిపత్యంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలందరికీ టార్గెట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా అంతటా గెలిచిన టీఆర్ ఎస్ ఒక్క కొల్లాపూర్ లో మాత్రం ఓడిపోయింది. అక్కడ టీఆర్ ఎస్ నుంచి పోటీచేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ఓడిపోయారు. ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.
జూపల్లి ఓటమికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే కుట్రపన్నారన్న టాక్ ఆ జిల్లాలో వినిపిస్తోంది. ఈ భూమి విషయంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేతో ఢీ అంటే అంటే ఢీ అన్న జూపల్లిని ఆ ఎమ్మెల్యే మిగతా ఎమ్మెల్యేతో కలిసి కుట్ర పన్ని ఓడించాడని టాక్.
అయితే జూపల్లి గెలిస్తే మళ్లీ మంత్రి అయ్యేవాడేమో.. కానీ ఓడాక కూడా ఇప్పుడు టీఆర్ ఎస్ లో పరపతి లేకుండా పోయింది. ఎందుకంటే ఇదే కొల్లాపూర్ లో జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కేశారు. ఇప్పుడు ఆయనదే నియోజకవర్గంలో రాజ్యమట.. మిగతా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకే కొమ్ము కాస్తున్నారట.. దీంతో నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు జూపల్లి మాటే వినడం లేదట..
తాజాగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ జూపల్లికి షాక్ తగిలింది. మొత్తం టీఆర్ ఎస్ లోకి జంప్ చేసిన హర్షవర్ధన్ రెడ్డియే చూశాడు. టీఆర్ ఎస్ అధిష్టానం సైతం ఆయనకే సపోర్ట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు గత ప్రభుత్వంలో వెలుగు వెలిగిన జూపల్లి ఇప్పుడు టీఆర్ ఎస్ లో ఒంటరిగా మిగిలిపోయారట.. ఆయనను ఏమాత్రం ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆయన అనుచరులు కూడా దిగాలుపడుతున్నారు.