సుక్కా.. ముక్కా లేనిదే ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు. వారమంతా చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్ వెజ్ తినందే పూట గడవని వారున్నారు. అలాంటి వారు చాలా మందికి తాజా పరిశోధన షాకిచ్చేలా ఉంది.
నిజానికి కరోనా వేళ రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మాంసం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో జనాలు చికెన్ ను ఎగబడి తింటున్నారు. రేట్ కూడా కిలోకు 300కు చేరువైంది.
అయితే ప్రతీరోజు మాంసం తినేవారిలో కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు వస్తాయని లండన్ కు చెందిన గ్లాస్గో విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. పిల్లలు అధికంగా మాంసాహారం తీసుకుంటే ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. యుక్తవయసు వచ్చేసరికి వృద్ధాప్య చాయలు కనిపిస్తాయని తెలిపింది. మాంసాహారం ఎక్కువ తింటే మూత్రపిండాలు దెబ్బతిని క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితంగా వారంలో రెండు రోజులకు మించి తినవద్దని సూచిస్తున్నారు.