డబ్బు.. అధికారం.. హోదాతో మాత్రమే వచ్చేవి కొన్ని ఉంటాయి. కోట్లాది మంది ఉన్నప్పటికీ.. పవర్ చేతిలో ఉన్న వారికి ఉన్నన్ని అవకాశాలు మరెవరికీ ఉండవు. ఒక పేదోడి పిల్లాడు బడికి వెళ్లటమే గొప్ప. వాడికి అది కూడా గొప్ప విషయమే. మరి.. బాగా డబ్బున్న వ్యక్తి కొడుక్కి స్కూల్ కు వెళ్లే ఇబ్బందేమీ ఉండదు. కానీ.. పవర్ చేతిలో ఉన్న వాళ్లకు ఉండే అవకాశాలు డబ్బులున్న వారికి ఉండదు.
అదెంత అన్న విషయం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడి విషయంలో ఇట్టే అర్థమవుతుంది. కేసీఆర్ మనమడు హిమాన్షు అదృష్టమే అదృష్టమని చెప్పక తప్పదు. చాలామంది రాజకీయ అధినేతలకు మనమలు ఉన్నా.. హిమాన్షు విషయంలో కేసీఆర్ ప్రదర్శించే శ్రద్ధ.. ప్రయారిటీ చాలా.. చాలా ఎక్కువనే చెప్పాలి. తన వెంట హిమాన్షును వెంటబెట్టుకొని వెళ్లేందుకే కేసీఆర్ ప్రదర్శించే ఆసక్తి అంతా ఇంతా కాదు. దీంతో.. చాలా స్వల్ప వ్యవధిలోనే.. అత్యంత ప్రముఖులైన వారి సరసన కూర్చొని హుషారుగా కబుర్లు చెప్పేసే అవకాశం లభిస్తుందని చెప్పక తప్పదు.
తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు వచ్చారు. వారిలో గవర్నర్ నరసింహన్ కూడా ఒకరు. కానీ.. ఆయన పక్కన కూర్చొని.. మాట్లాడే అవకాశం కేసీఆర్ మనమడు హిమాన్షుకే దక్కిందని చెప్పాలి. చాలా చిన్న వయసులోనే అత్యంత కీలక వ్యక్తుల పక్కన కూర్చోవటం ఒక ఎత్తు అయితే.. వారితో సరదాగా ముచ్చట్లు చెప్పే అవకాశం కొద్దిమందికే లభిస్తుందని చెప్పక తప్పదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఇదే హిమాన్షు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. నిజానికి నరసింహన్ ఇప్పుడున్నట్లే.. రాష్ట్ర విభజనకు ముందే గవర్నర్ గా ఉన్నారు. అప్పటికే హిమాన్షు కాస్త పెద్దోడే. కానీ.. అతడికి గవర్నర్ లాంటి వారితో కలిసే అవకాశం లేదు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే.. గవర్నర్ నరసింహన్ తో దోస్తానా కుదిరింది. అది కాస్త మరింత ఎక్కువైందని చెబుతారు.
ఉద్యమ నేతగా కేసీఆర్ గురించి నరసింహన్ కు తెలిసినప్పటికీ.. ముఖ్యమంత్రి అయ్యాకనే నరసింహన్ దగ్గర కేసీఆర్ ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కంటే కూడా.. కేసీఆర్ కే గవర్నర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కూడా చెబుతుంటారు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ మాటల్లో ఉండే ఆకర్షణతో పాటు.. కొందరిపట్ల ఆయన ప్రదర్శించే గౌరవ మర్యాదలకు ఎంతటి వారైనా సరే.. ఇట్టే ఫ్లాట్ అయిపోతారని చెబుతుంటారు. అయితే.. ఇలాంటివన్నీ ఉన్నాయన్న విషయం కీలకస్థానాల్లో ఉండే ప్రముఖులకు తెలవాలంటే.. పవర్ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అంటారు.. అధికారమా.. మజాకానా అని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/