ఏపీలో ఇదేం పోయేకాలం? ఇంట్లోకి వచ్చేసి మహిళపై అత్యాచారం

Update: 2022-05-04 03:14 GMT
ఏపీకి ఏమైంది? భయం నరం తెగిపోయిందా? విచక్షణ పోయి విచ్చలవిడితనం పెరిగిపోయిందా? ఎలాంటి ఆరాచకం చేసినా ఎవరూ ఏమీ అనరన్న బరితెగింపు మొదలైందా? ఇటీవల కాలంలో ఏపీలో చోటు చేసుకుంటున్న దారుణాల్ని చూసినప్పుడు ఇలాంటి సందేహాలు రాక మానదు. రెండు రోజుల క్రితం రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్తపై దాడి చేసి.. అతడి కళ్ల ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం మర్చిపోక ముందే.. మరో ఆరాచకం రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులకు అందిన కంప్లైంట్ మేరకు బాధిత మహిళను ఆమె పిల్లలు ఎదుటే అత్యాచారం చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఒంటరి మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆమెపై దాడికి పాల్పడి అత్యాచారం చేసిన వైనం ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇంట్లో ఉన్న మహిళకు సైతం రక్షణ లేకుండా పోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రైల్వే స్టేషన్ లాంటి బహిరంగ ప్రదేశంలో గ్యాంగ్ రేప్.. ఇప్పుడు ఇంట్లోకి చొరబడి అత్యాచారం మాత్రమే కాదు.. రేపల్లె ఉదంతంలో భర్త ఎదుట.. తాజా దారుణంలో పిల్లల ఎదుట అత్యాచారానికి పాల్పడటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న.

అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన పాతికేళ్ల మహిళ భర్తతో విభేదాలతో దూరంగా ఉంటోంది. జీవనోపాధి కోసం విజయనగరానికి వచ్చింది. అక్కడి ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ కు సమీపంలోని ఒక టీ షాపులో పని చేస్తోంది. వుడా కాలనీలో ఉంటోంది. దగ్గరి బంధువు ఒకరు విశాఖపట్నంలో అనారోగ్యంతో చికిత్స పొందుతుంటే.. అతడ్ని పరామర్శించేందుకు సోమవారం ఉదయం వరసకు తమ్ముడయ్యే వ్యక్తి వాహనం మీద విజయనగరానికి వెళ్లి.. అదే రోజు రాత్రి ఇంటికి చేరుకుంది.

రాత్రి 11.30 గంటల వేళలో 19 ఏళ్ల చెర్రీ.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. ఆమెతో గొడవపడి.. బండి తాళం చెవితో ఆమెపై దాడికి పాల్పడి.. తలను గోడకేసి కొట్టి గాయపర్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న సోదరుడ్ని బయటకు గెంటేసి.. పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆరాచకం ఇలా సాగుతుంటే.. బయటకు గెంటేసిన సోదరుడు.. బాధితురాలికి తెలిసిన మరో మహిళ వద్దకు వచ్చి ఆమెను తీసుకురావటంతో.. వీరిని చూసిన చెర్రీ పారిపోయాడు. ఇతడు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా చెబుతున్నారు.

బాధితురాలి ఇంటికి వచ్చిన ఆ మహిళ.. ఆమెను, పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్లింది. కాసేపటికి ఆ మహిళ ఇంటికి చెర్రీ.. అతడి స్నేహితులు వెళ్లారు. తనకు వరసయ్యే చెల్లిల్ని ఏమీ చేయొద్దని మహిళ కోరగా.. తన కోరికను ఆమె తీర్చాలని వేధించాడు. దీంతో భయపడిన ఆమెను బయటకు నెట్టేశారు. బాధితురాలికి సోదరుడు వరుసయ్యే కుర్రాడ్ని.. పిల్లల్ని గదిలోకి తోసేసి.. ఇంటి తలుపులు మూసేసి మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తర్వాత బయట కాపలాగా ఉన్న మరో కుర్రాడు వచ్చి కోరిక తీర్చమని బలవంతం చేస్తే బాధితురాలు చెర్రీని.. ఆ యువకుడ్ని బయటకు తోసేసి ఇంటి తలుపులు మూసేశారు. జరుగుతున్న పరిణామాల షాక్ నుంచి తేరుకున్న ఆమె.. తాను పని చేసే టీ షాపు యజమానికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాల గురించి సమాచారం ఇచ్చారు. దీంతో.. చెర్రీ అతని స్నేహితులు పారిపోయారు. సోమవారం రాత్రి 11.30గంటల నుంచి అర్థరాత్రి 3.30గంటల వరకు ఈ ఆరాచక పర్వం సాగినట్లు చెబుతున్నారు.

బాధితురాలు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెనువైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ దీపికా ఎం. పాటిల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితురాలు ఇచ్చిన సమాచారానికి పిల్లల సమాచారానికి కాస్త తేడా ఉందని.. మరింత లోతుగా విచారించి మొత్తం వివరాల్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిందితుడ్ని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News