చనిపోయింది బగ్దాదీ అని ఎలా డిసైడ్ చేశారు?

Update: 2019-10-31 04:26 GMT
తీవ్రమైన చర్యలతో ప్రపంచానికి వణుకు పుట్టించిన ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ ఆచూకి ఎలా తెలిసింది? చనిపోయింది అతగాడే అన్న విషయాన్ని ఎలా కన్ఫర్మ్ చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర సమాధానం లభించింది. బాగ్దాదీ ఆచూకీని కన్ఫర్మ్ చేయటానికి.. ఆయన ఉపయోగించిన అండర్ వేర్ సాయంతోనే ఐసిస్ చీఫ్ ను గుర్తించినట్లు చెబుతున్నారు.  

బాగ్దాదీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ వ్యక్తి కీలక సమాచారాన్ని అమెరికా బలగాలకు అందజేసినట్లుగా చెబుతున్నారు. బగ్దాదీని మట్టుబెట్టటంలో శకుని పాత్రను అతను పోషించాడు. తన కుటుంబసభ్యుల్లో ఒకరిని ఐసిస్ ఉగ్రవాదులు చంపటంతో.. పగతో రగిలిపోయిన అతను ఆ సంస్థలో చేరాడు.

విధేయుడిగా వ్యవహరించి బాగ్దాదీకి సన్నిహితంగా వెళ్లగలిగాడు. అతడి అండర్ వేర్ ను దొంగలించి.. అమెరికా బలగాలకు ఇవ్వటం.. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతను బాగ్దాదీ అన్న విషయాన్ని గుర్తించిన అమెరికన్లు.. అతడ్ని మట్టుబెట్టారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. బాగ్దాదీ తలకు అగ్రరాజ్యం రూ.177 కోట్ల మొత్తాన్ని బహుమానాన్ని కట్టింది. అతగాడి ఆచూకీ తెలిపిన వారికి ఈ భారీ మొత్తాన్ని ఇస్తానని ప్రకటించింది. బాగ్దాదీ అండర్ వేర్ ను తమకిచ్చిన వ్యక్తికే ఈ భారీ బహుమానాన్ని అందజేస్తారని చెబుతున్నారు. ఒక అండర్ వేర్ గుట్టుగా దొంగలించి వచ్చిన దానికి రూ.177 కోట్ల భారీ మొత్తం లభించటం విశేషం.
Tags:    

Similar News