ఆ ఉగ్రవాది తల్లిని ఏమనాలి?ఎలా శిక్షించాలి?

Update: 2016-01-03 05:41 GMT
పిల్లలు తప్పులు చేస్తే.. పెద్దలు సరిదిద్దాలు. బాధ్యతగా ఉండాలని హెచ్చరించాలి. అంతేకానీ.. తెలిసీ తెలియక తప్పు చేసిన పిల్లల్ని వెనకేసుకురావటం.. వారి మాటకు వత్తాసు పలకటం ఏ మాత్రం మంచిది కాదు. చిన్న విషయాలకే ఇంత కఠినంగా ఉంటే.. వేరే దేశం మీద యుద్ధం చేయటం.. అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాద కార్యకలాపాలకు కొడుకు పాల్పడుతుంటే.. తల్లి ఎలా స్పందించాలి? తన లాంటి తల్లులకు కడుపుకోత కలగనీయొద్దని హెచ్చరించాలి? వయసులోకి వచ్చిన కొడుకు కుదరదంటే అలాంటి వారిని నిలువరించేందుకు చట్టాన్ని ఆశ్రయించాలి.

కానీ.. అలాంటిదేమీ లేకుండా కొడుకు చేస్తున్న చెత్తపనిని ఎంకరేజ్ చేయటమే కాదు.. సలహాలు ఇస్తున్న ధోరణి చూస్తే.. ఇలాంటి తల్లుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పటాన్ కోట్ ఎయిర్ బేస్ స్టేషన్ మీద దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడు.. తన ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు పాక్ లో ఉన్న తన తల్లికి ఫోన్ చేశాడు. తాను చేస్తున్న మిషన్ గురించి చెప్పి..తాను బతికి ఉంటానో.. చచ్చిపోతానో తెలీదని వ్యాఖ్యానించినప్పుడు.. సదరు రాక్షస తల్లి స్పందిస్తూ.. చనిపోయే ముందు ఏదైనా తినాలంటూ తన ప్రేమను ప్రదర్శించింది.

పాపం.. పుణ్యం తెలీని అమాయకుల్ని చంపేందుకు వెళుతున్న కొడుకును నిలువరించాల్సింది పోయి.. వీలైనంత మందని చంపేసి.. నువ్వు చచ్చిపో. కాకుంటే.. కాస్తంత తిని చచ్చిపో.. ఆకలితో చచ్చిపోమాకు అని చెప్పే ఆ తల్లిని ఏమనాలి? ఎలా శిక్షించాలి..?
Tags:    

Similar News