సమాజం బాగుపడాలనే కలతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఒంగోలు ఏ1 ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశాలను, తన ఆశయాలను కార్యకర్తలకు పవన్ వివరించారు. తాను ఒంగోలు - నెల్లూరు జిల్లాల్లో చదువుకున్నానని - పదో తరగతి చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకున్నానన్నారు. పార్టీని ఎలా నడిపిస్తానోనని తనపై చాలా మందికి సందేహాలున్నాయని, ప్రపంచాన్ని మార్చింది ఒకప్పుడూ ఒక్కడే అని గుర్తుచేశారు. 'భయాలు ఉంటాయి.. ఒత్తిళ్లు ఉంటాయి.. మూడున్నర సంవత్సరాలుగా నువ్వు పార్టీని ఏం నడిపించావ్?.. పాలక వర్గాల మద్దతు లేదు, పెద్ద మనుషులు లేరు.. లింగు లిటుకుమంటూ ఏం చేస్తావ్? అన్నారు. కానీ ఒక్కడితోనే ప్రపంచం కదులుతుంది మార్పు వస్తుంది..` అని పవన్ వివరించారు.
రాజకీయాలంటే ప్రజల్లో భయం పోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. క్రమశిక్షణ - జవాబుదారీతనం - బాధ్యతతోనే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ఒకరిని ప్రశ్నించాలి అంటే క్రమశిక్షణ అవసరమన్నారు. భావితరాల భవిష్యత్ బాగుండాలనే ఈ నిర్ణయానికి వచ్చానన్నారు. తాను చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద స్పూర్తిగా పెరిగానని పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు సీఎం సీఎం అంటే అవను, తాను పొంగిపోననన్నారు. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలన్నారు. అన్ని కులాల మధ్య సామరస్యం కావాలన్నారు. అవకాశవాద రాజకీయాలకు తాను దూరం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధికారం - ధనం - పేరు ప్రఖ్యాతులు పోయినా జనంలో నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోనన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా తాను ముందుకెళ్తానన్నారు. తనకు రాజకీయాలతో పిడికెడు లాభం లేదన్నారు. అధికారం కాదు.. అభిమానులే తనకు అలంకారమన్నారు. నా నిగ్రహాన్ని చేతగాని తనంగా భావించొద్దన్నారు. కొంతమంది టీడీపీ నేతలు నన్ను అవమానించినా ప్రజల కోసమే టీడీపీకి మద్దతు తెలిపానన్నారు.
అమిత్ షా తనను బీజేపీలోకి రావాలని పిలిచారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అడిగారని - ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయనని స్పష్టంగా చెప్పానన్నారు. జాతీయ పార్టీలు బలంగా పని చేస్తే ప్రాంతీయ పార్టీల పుట్టుకే ఉండేది కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై నైతిక హక్కు కోల్పోకూడదనని - అదే జరిగితే జనం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తారన్నారు.నైతిక బలంతోనే గట్టిగా పోరాడగలమని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావని, సామరస్యంగానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. బీజేపీ - టీడీపీలకు మద్దతివ్వడం వల్లే బాధ్యతగా సమస్యలపై ప్రశ్నిస్తున్నానన్నారు. అకౌంటబిలిటీ లేకపోవడం వల్లే ఏపీ విభజన సరిగా జరగలేదన్నారు. ప్రత్యేక హోదాపై జనసేనది - తనది వ్యక్తిగత పోరాటం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని కొందరు తనను ప్రశ్నిస్తున్నారన్నారు. స్టేటస్ కోసం బలంగా పోరాటం చేయగలనన్నారు. హోదా కోసం పోరాటానికి పార్టీలు - ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కోరుకుంటే.. 'మా తెలంగాణ' అనుకుంటే వాళ్లకు రాష్ట్రం వచ్చింది. కానీ హోదా ఉద్యమానికి మీరు సిద్దంగా ఉన్నారా? ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయా?.. తెలుగుదేశం - వైసీపీ సిద్దంగా ఉన్నారా?..' అని ప్రశ్నించారు. సామ - దాన - భేద పద్దతుల తర్వాతే స్టేటస్ పై పోరాటం చేస్తామన్నారు. స్టేటస్ ఎందుకివ్వడం లేదో కేంద్ర ప్రభుత్వం చెప్పాలన్నారు.
ఈ సందర్భంగా ఏపీలని మంత్రులు - ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. `ఇక్కడి మంత్రులు అక్కడివాళ్ల పెళ్లిళ్లకు - శభకార్యాలకు వెళ్తారు.. తెలంగాణలో కాంట్రాక్టులు తెచ్చుకుంటారు.. ఇవి నేను చెప్పినవి కాదు.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు` అంటూ పవన్ అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 'అవసరమైతే ఆయుధం కూడా పట్టగల సత్తా ఉన్నవాడిని మరిచిపోకండి. తెలుగుదేశం విజయవకాశాలకు అప్పట్లోనే గండి కొట్టగలగి ఉండేవాడిని. కానీ చేయలేదు. ఎందుకు?.. జల్సాలో ఒక డైలాగ్ ఉంది. "చేతిలో కత్తి ఉండి.. చంపడానికి కారణాలు ఉండి.. తెగనరకడానికి తల ఉండి.. చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది. మీకుందా!" తెలుగుదేశం పార్టీకి ఇంకోసారి గండికొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి' అని పవన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. "ఎన్నికల్లో నేను ఓడిపోవచ్చు కానీ దెబ్బకొట్టే వెళ్తాను"అని పవన్ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు బాగా పనిచేస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టవన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా గతంలో తనకు గుండు కొట్టించారన్న వార్తను ఖండించారు. మామూలుగా ప్రారంభం అయిన ప్రచారం పత్రికల పతాక శీర్షికగా మారిందన్నారు. ` ఈ ప్రచారం సమయంలో రోడ్డు పైకి వచ్చాను. ముందు పోన్లే అనుకున్నాను.. కానీ నేనేమైనా చేతకాని వాజెమ్మ అనుకున్నారా?.. ఉప్పు కారం తింటున్నవాడిని.. చాలా పౌరుషం ఉంది నాకు. నా నిగ్రహం చేతకాని తనం కాదు. సంయమనం` అని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో వలే కులాల ప్రస్తావన లేకపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని పవన్ మరోమారు ఉద్ఘాటించారు. మకిలి లేని అజ్ఞానం లేని రాజకీయాలను జనసేన తీసుకువస్తుందని పవన్ తెలిపారు. అందులో భాగమే ప్రస్తుత చలోరే చల్ ఉద్దేశమన్నారు.