వార్ జెట్ కంటే ముందే.. వీర్ చ‌క్ర రానుంద‌ట‌!

Update: 2019-04-21 05:06 GMT
పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని వెంటాడి.. దాన్ని కూల్చేసిన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. కోట్లాది మంది దేశ ప్ర‌జ‌లు ఆయ‌న రాక‌కోసం ఎంత‌లా త‌పించారో గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నేటికి ఆ అనుభ‌వం జాతి జ‌నుల మ‌న‌సుల్లో ప‌చ్చిగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

పాక్ వార్ జెట్ ను కూల్చే క్ర‌మంలో తన ఫైట‌ర్ ఫ్లైట్ ను కోల్పోయి.. పాక్ లో చిక్కుకుపోయిన అభినంద‌న్.. భార‌త్ కు చేరుకోవ‌టం.. అనంత‌రం ఫార్మాలిటీస్ తో బిజీ బిజీగా గ‌డ‌వ‌టం తెలిసిందే. మ‌ళ్లీ వార్ జెట్ ను న‌డ‌పాల‌ని త‌పిస్తున్న ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లతో పాటు.. చాలానే ప్రాసెస్ ఉంది. ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం సాధార‌ణ బదిలీని పొందిన ఆయ‌న చేతికి వార్ జెట్ కంటే ముందు వీర్ చ‌క్ర పుర‌స్కారాన్ని అందుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

యుద్ధ స‌మ‌యాల్లో ఇచ్చే శౌర్య ప‌త‌క‌మైన వీర్ చ‌క్ర పుర‌స్కారాన్ని అభినంద‌న్ వ‌ర్ద‌మాన్ కు ఇవ్వాలంటూ కేంద్రానికి భార‌త వైమానిక ద‌ళం సిఫార్సు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్ర‌భుత్వం ఇప్ప‌టికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకున్నా.. త్వ‌ర‌లో ప‌క్కాగా ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. యుద్ధ వీరుల‌కు ఇచ్చే అత్యున్న పుర‌స్కారాలైన ప‌ర‌మ‌వీర చ‌క్ర‌.. మ‌హావీర చ‌క్ర త‌ర్వాత ఇచ్చే మూడో అత్యున్న పుర‌స్కారంగా వీర్ చ‌క్రను చెప్పాలి. నాలుగువారాల పాటు సెల‌వులో ఉన్న అభినంద‌న్ గ‌త నెల‌లో శ్రీ‌న‌గ‌ర్ లోని త‌న స్వ్క్రాడ‌న్ లో చేరారు.

తాజాగా అత‌న్ని శ్రీ‌న‌గ‌ర్ బేస్ నుంచి ప‌శ్చిమ సెక్ట‌ర్ లోని మ‌రో వైమానిక స్థావ‌రానికి బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు విడుద‌ల‌య్యాయి. అయితే.. ఇది రెగ్యుల‌ర్ ట్రాన్స‌ఫ‌ర్ గా చెబుతున్నారు. అయితే.. అభినంద‌న్ కోరిక అయిన వార్ పైలెట్ లో భాగంగా ఆయ‌న‌కు వార్ జెట్ చేతికి ఇస్తారా? అన్న‌ది మాత్రం తేలాల్సి ఉంది. చూస్తుంటే.. వార్ జెట్ కంటే ముందు వీర్ చ‌క్ర అభినంద‌న్ చేతికి వ‌చ్చేలా ఉందే! 
Tags:    

Similar News