మీరు రగిలిపోండి.. రగిలిపోండి.. అని రాజకీయ నాయకులు ఎంత చెప్పినా రగిలిపోవటం తర్వాత.. ఆ.. చెప్పార్లే అన్నట్లుగా వ్యవహరించే సగటు బడ్జెట్ జీవులకు నిజంగానే రగిలిపోతే.. వారి కడుపు మండిపోతే సీన్ ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా గురువారం బెజవాడ వీధుల్ని చూసిన వారికి దాదాపుగా అర్థమవుతుంది. బుధవారం ఉదయం మొదలు.. అర్థరాత్రి వరకు.. ఆ మాటకు వస్తే తెల్లవారుజాము వరకు కూడా ఏపీ వ్యాప్తంగా చిన్న చిన్న ఊళ్ల నుంచి పెద్ద పట్టణాల వరకు రైల్వే స్టేషన్లు.. బస్టాండ్లు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షలాది మంది ఒక్కసారిగా కదలి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికి అర్థమైన పరిస్థితి.
పోలీసుల సాయంతో భారీ ఎత్తున ఆంక్షలు విధించి.. రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కటానికి కూడా ఒప్పుకోకుండా నిలువరించిన ఉదంతాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ కావటం తెలిసిందే. ఉద్యమం.. నిరసన.. వంకాయ అంటూ మాట్లాడకుండా.. నోరు మూసుకొని ఇంటికి వెళ్లాలన్న హెచ్చరికలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురయ్యాయి. సర్లే.. మనకెందుకీ తలనొప్పి అనుకున్న వారిలో పలువురు ఇళ్లకు వెళితే.. ఇదెక్కడి అన్యాయం అంటూ నోరు విప్పిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ కు తరలించిన వైనాలు ఉన్నాయి. ఇలాంటివేళ.. విజయవాడ నిరసన ర్యాలీకి పెద్దగా హాజరు ఉండదన్న వాదన వినిపించింది.
అందుకు భిన్నంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పలువురు.. వివిధ వేషాల్లో సిద్ధమై.. పల్లెటూరు మనుషుల మాదిరి తయారైన వైనాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి చేస్తున్నాయి. ఎవరికి వారు తమను ఉద్యోగుల మాదిరి కాకుండా.. చిన్న చితకా పనులు చేసుకొని బతికే వారి మాదిరి తయారయ్యారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు.. తాము చేస్తున్న వినూత్ననిరసనకు సంబంధించిన వేషాలు గుర్తుండిపోయేలా వారు తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయని