'కశ్మీర్ ఫైల్స్'తో దేశం విడిపోతే.. 'ఆర్ఆర్ఆర్' భారతదేశాన్ని ఏకం చేసింది..

Update: 2022-03-28 11:33 GMT
దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు  పన్ను మినహాయింపు ఇచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై సీతక్క కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సినిమా దేశాన్ని విడగొట్టేలా ఉందని.. దాన్ని ఎవరూ చూడవద్దని కోరింది.  

తన ట్విటర్‌లో సీతక్క ఈ మేరకు ట్వీట్ చేశారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' వంటి చిత్రాలు భారతదేశాన్ని విభజించాయి. అయితే 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు భారతదేశాన్ని ఏకం చేస్తాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని అన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపులు ఇవ్వాలని సీతక్క కోరారు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వాన్ని.. హీరోలు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు  అద్భుతమైన నటనకు సీతక్క అభినందనలు తెలిపారు.

'ది కాశ్మీర్ ఫైల్స్' వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కాశ్మీర్ ప్రాంతంలో 1990లో కశ్మీర్ పండింట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

ఈ చిత్రం విపరీతమైన సమీక్షలను అందుకుంది, అయితే కాశ్మీరీ పండిట్‌ల దీనగాథను ప్రపంచానికి చూపించింది. బీజేపీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి తమ రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును ఇచ్చింది.  మోడీ, అమిత్ షా సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

కాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' తొలి వారాంతం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం అమెరికాలో.. తెలుగు రాష్ట్రాల్లో $10 మిలియన్ల వరకు వసూలు చేసింది, ఈ చిత్రం రికవరీ రేటు 70 శాతానికి పైగా ఉంది.

మొదటి వారాంతంలో అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది.  గొప్ప ఫీట్ సాధిస్తూ  రెండో వారాంతంలో 'ఆర్ఆర్ఆర్' బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News