పాకిస్థాన్ అంటేనే... వివాదాలకు కేంద్రంగా సాగుతున్న దేశం. ఆ దేశమే కాదు... ఆ దేశాన్ని పాలించే ప్రధానమంత్రులు కూడా వివాదాలతో సాగుతున్నావారే. అందుకు ప్రస్తుతం ఆ దేశానికి ప్రధానిగా ఉన్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా మినహాయింపేమీ కాదు. అంతేకాదండోయ్... మిగిలిన ప్రధానుల కంటే కూడా ఇమ్రాన్ మరింత ప్రత్యేకమని చెప్పాలి. తనకు వైద్యం చేసేందుకు వచ్చిన నర్సులంతా తనకు దేవకన్యల్లా కనిపించారని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయినా చికిత్స తీసుకున్నారంటేనే.. ఏదో అనారోగ్యం తిరగబెడితేనే ఆసుపత్రికి వెళ్లినట్లు లెక్క. అంటే అనారోగ్యంతో ఉండి కూడా తన చుట్టూ చేరిన నర్సులు తనకు దేవకన్యల్లా కనిపించారంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారంటే వైరల్ కాక ఎలా ఉంటుంది.
నిజమే... ఇమ్రాన్ రేపిన ఈ వివాదం అసలు విషయంలోకి వెళితే... గతంలో ఓ స్టేజీ మీద ఇమ్రాన్ ప్రసంగిస్తుండగా... స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది కదా. అప్పుడెప్పుడో జరిగిన ఈ ఘటనలో గాయాలపాలైన ఇమ్రాన్ ను ఆయన పార్టీ నేతలు హుటాహుటీన షౌకత్ ఖానూన్ ఆసుపత్రికి తరలించారు. ఓ జాతీయ పార్టీకి అధినేతగా ఉన్న ఇమ్రాన్ గాయపడితే... ఆయనకు చికిత్స చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో డాక్టర్ అసీమ్ గాయాల కారణంగా ఇమ్రాన్ కు వచ్చిన నొప్పిని తగ్గించేందుకు ఓ ఇంజెక్షన్ ఇచ్చారట. సదరు ఇంజెక్షన్ తన బాడీలోకి వెళ్లినంతనే తన గాయాల బాధ ఒక్కసారిగా తగ్గిపోయిందని, ఆ వెంటనే తన చుట్టూ ఉన్న నర్సులంతా తనకు దేవకన్యల్లా కనిపించారని ఇమ్రాన్ వ్యాఖ్యానించారట. నర్సులు తనకు దేవకన్యల్లా కనిపించడానికి కారణం ఆ ఇంజక్షనేనన్న కోణంలోనే ఇమ్రాన్ సదరు వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయాన్ని ఇమ్రాన్ ఇటీవల ఏదో సందర్భంలో సవివరంగా చెప్పుకొచ్చారట. అయితే నాటి తన అనుభవాన్ని ఇమ్రాన్ చెబితే... దానిని పూర్తిగా వీడియో తీసిన ఓ జర్నలిస్టు... ఇప్పుడు సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అయినా... ఇమ్రాన్ ఇంజక్షన్ ప్రభావంతోనే తాను అలా మాట్లాడానని చెప్పినట్టుగా స్పష్టంగా ఉన్నా కూడా... ప్రధాని హోదాలో ఉండి కూడా నర్సుల అందాన్ని అభివర్ణిస్తూ వారంతా దేవకన్యల్లా ఉన్నారని వ్యాఖ్యానించడం కాస్తంత ఇబ్బందే కదా. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అయితే ఈ దిశగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని మాత్రమే జర్నలిస్ట్ పోస్ట్ చేయగా... మరో వ్యక్తి ఇమ్రాన్ మొత్తం వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తొలి ఇంజక్షన్ తీసుకున్న తర్వాత నొప్పి మటుమాయం అయిపోయిందని చెప్పిన ఇమ్రాన్... తన మనసు తన పరిధిలో లేదన్న విషయాన్ని గుర్తించి తనను నార్మల్ కండీషన్ లోకి తీసుకొచ్చేలా మరో ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఏది ఏమైనా... ఓ దేశానికి ప్రధానిగా ఉండి నర్సులను దేవకన్యలతో పోల్చిన ఇమ్రాన్ వ్యాఖ్యలు ఎంత వద్దనుకున్నా వైరల్ గా మారిపోయాయి.