కర్నాటక ఎన్నికల్లో వైసీపీ...కేసీయార్ తో పోటీగా.....?

Update: 2022-12-11 11:30 GMT
కర్నాటక ఎన్నికలు కాదు కానీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హడావుడి ఒక్కసారిగా పెరుగుతోంది. ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి అని తన పార్టీ పేరు మార్చి దేశంలో ఎక్కడైనా పోటీకి తయారు అని కేసీయార్ అంటున్నారు. ఆయన తొలి పరీక్షగా కర్ణాటకలో బీయారెస్ అభ్యర్ధులను దించాలని చూస్తున్నారు. ఆయన జాతీయ పార్టీగా తన ప్రభావం చాటాలని అనుకుంటున్నారు. ఇది ఇపుడు పాత న్యూస్ అయింది.

కానీ కొత్త న్యూస్ ఏంటి అంటే ఏపీ నుంచి వైసీపీ అధినేత జగన్ కర్నాటక ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. కర్నాటకలో వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కొత్త ఏడాది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి నుంచె గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో కన్నడ నాట తమ సత్తా చాటేందుకు వైసీపీ కూడా చూడడమే ఇంటరెస్టింగ్ పాయింట్. కర్నాటకలో తెలుగు వారు సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే రాయలసీమ సరిహద్దు నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో అక్కడ వైసీపీ తన పార్టీ అభ్యర్ధులను పోటీకి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సీరియస్  గానే చేస్తోంది అంటున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ న్యూస్  తెగ వైరల్ అవుతోంది అని అంటున్నారు. కర్నాటకలో బీజేపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఉన్నారు. ఆయనతో ఇప్పటికే వైసీపీ ఈ విషయంలో తొలి విడత చర్చలను పూర్తి చేసింది అని అంటున్నారు. ఆయనతో కలసి కీలక నియోజకవర్గాలలో పోటీకి తయారు అవుతోంది అంటున్నారు. బీజేపీలో గాలి ఏమంత సుఖంగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి. ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారు అని చెబుతున్నారు. దాంతో గాలితో వైసీపీకి ఉన్న పాత పరిచయాలను పురస్కరించుకుని వచ్చే ఎన్నికల్లో కన్నడ సీమలో ఢంకా భజాయించేందుకు వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది అని అంటున్నారు.

ఈ మేరకు జగన్, జనార్దన్ రెడ్డిల మధ్య తొలి రౌండ్ చర్చలు సానుకూలంగా ముగిశాయని సోషల్ మీడియాలో  ఓ ట్వీట్‌ వైరల్ అవుతఒంది. ఇక పోటీ ఎక్కడ అన్నది కనుక చూస్తే తెలుగువారి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలను, ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం నుంచి సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను జగన్ ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే తెలుగు వారు మరీ ముఖ్యంగా రాయలసీమకు చెందిన వారు అనేక మంది ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం,  సాఫ్ట్‌వేర్ రంగాల కోసం కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడి ఉన్నారు.

అలా కనుక చూస్తే  ఆంధ్రలోని పలు జిల్లాలతో పాటు, రాయలసీమ నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు ఈ లెక్కను చూసుకునే వైసీపీ కన్నడ సీమలో పోటీకి తయారు అని అంటోందిట. వైసీపీ తన అభ్యర్థులను నిలబెట్టే ప్రాంతాలుగా చాలా వాటిని పేర్కొంటున్నారు. అందులో  రాయచూర్, చిక్కబళ్లాపూర్,  కోలార్, సిధనూర్, దేవదుర్గ, బళ్లారి, సిరిగుప్ప. చిత్రదుర్గ మొదలైనవి ఉన్నాయని అంటున్నారు.

ఇలా కనీసం ఒక ఇరవై సీట్లకు పోటీ పెట్టినా అందులో  కనీసం డజను సీట్లు గెలుచుకోవడంపై వైసీపీ దృష్టి సారించిందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అటు కేసీయార్ కన్నడ సీమ మీద చూపు ఉంచారు. ఇపుడు జగన్ కూడా అంటే చూస్తే మాత్రం కర్నాటక రాజకీయాల్లో తెలుగు పాలిటిక్స్ ఏ మలుపు తీసుకుంటాయో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News