అతి త్వరలో దేశం లో ప్రధాన సమస్యలుగా భావిస్తున్న కొన్ని కీలక కేసులపై సుప్రీం కోర్టు తన తుది తీర్పుకి వెల్లడించనుంది. ఈ నెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గగోయ్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయన పదవిలో ఉండగానే 6 ప్రధాన, కీలక కేసుల్లో తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సన్నద్ధం అవుతోంది. అందులో అత్యంత ముఖ్యమైనది అయోధ్య కేసు. ఈ అయోధ్య పై తుది తీర్పు వెలువడుతుంది అన్న నేపథ్యంలో దేశం మొత్తం టెంక్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఈ అయోధ్య కేసులో ఎవరికీ మద్దతుగా తీర్పు వచ్చినా ..మరో వర్గం వారు రెచ్చిపోతారు. దీనితో దేశంలోని పలు సున్నితమైన ప్రాంతాలలో భద్రతని కట్టుదిట్టం చేసారు. ముఖ్యంగా అయోధ్య ని ఇప్పటికే బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఈనేపథ్యంలో బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులకు హితోపదేశం చేశారు. అయోధ్య అంశంపై ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని, దేశంతో శాంతి సామరస్యాలను, శాంతి భద్రతలను పరిరక్షించుకోవాల్సిన బాధత్య ప్రతీ ఒక్కరిపైనా వుందని మోదీ చెప్పినట్లు సమాచారం.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఎలాంటి పక్కా ప్రణాళికలు అమలు చేసిందో ..ఈ అయోధ్య పై తుది తీర్పు వెలువడినా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేదుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ అనంతరం అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత దేశంలో పెద్దగా ఘర్షణలు జరగలేదు. అడపాదడపా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు మినహా దేశంలో మత ఘర్షణలు తగ్గాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అయోధ్య తీర్పు రానుండడంతో పరిస్థితి ఎలా వుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తీర్పు ఎవరికీ అనుకూలంగా ఉన్నా కూడా ..సుప్రీం తీర్పుని అందరూ సమర్దించాలి అని కొందరు ప్రచారం చేస్తున్నారు.