దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే అతిపెద్దదిగా ఘనతకెక్కిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో దాదాపు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నీరవ్ మోడీతో పాటు ఆయన మామ మెహుల్ చోక్సీకి సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్ బీడబ్ల్యూ)లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నీరవ్ మోడీని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. ప్రస్తుతం నీరవ్ మోడీ హాంకాంగ్ లో ఉన్నట్లు తెలియడంతో ఆయనను అరెస్టు చేయాలని హాంకాంగ్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు - పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్ పోలీసులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ మీడియాకు వివరించారు.
పీఎన్‌బీ కుంభకోణంపై దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంటూ నీరవ్, చోక్సీ ఈ-మెయిళ్లకు సీబీఐ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినప్పటికీ వ్యాపార కారణాలతో పాటు ఆరోగ్య సమస్యలను సాకుగా చూపుతూ వారు అందుకు నిరాకరించిన విషయం విదితమే. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు సహకరించేందుకు నీరవ్, చోక్సీ పదేపదే నిరాకరిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేసిన విజ్ఞప్తి మేరకు ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంతో ఇంటర్‌పోల్ నుంచి ఈ ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు మార్గం సుగమమైంది. అదే సమయంలో ఆయన్ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో త్వరలో ఈ అరెస్టు జరగనుంది.
ఇదిలాఉండగా...వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ నిర్వాకం వలన దాదాపు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)కు శస్త్ర చికిత్స పూర్తయిందని, కోలుకోవడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా అన్నారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే అతిపెద్దదిగా చరిత్రకెక్కిన ఈ కుంభకోణం నుంచి పీఎన్ బీ తేరుకునేందుకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు బ్యాంకు ఉద్యోగులు - ఇతర భాగస్వాములు ఎంతో మద్దతు ఇచ్చి అండగా నిలిచారని ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. `మా ముందు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ సర్దుకుంటున్నాయి. సర్జరీ పూర్తవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మేము కోలుకునే దశలో ఉన్నాం. మరో ఆరు నెలల్లో ఈ సమస్య నుంచి బయటపడగలమని భావిస్తున్నాం` అని సునీల్ మెహతా స్పష్టం చేశారు.