ప్రశాంతంగా బతికేందుకు ఇష్టపడని దాయాది.. భారత్ లో నిత్యం ఏదో కలకలం సృష్టించాలని.. అస్థిర పర్చేందుకు అదే పనిగా కుట్రలు చేస్తున్న వైనం తెలిసిందే. దేశం నుంచి విడిపోయిన నాటి నుంచి భారత్ ను ఏదోలా కెలకటం దాని జీవిత లక్ష్యంగా మారటమే కాదు.. ఆ దేశానికి పాలకులుగా వ్యవహరించిన వారంతా ప్రజల కష్టాల్ని తీర్చటం కంటే.. భారత్ ను ఏదోలా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించటం తెలిసిందే.
ఇందులో భాగంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి.. ఇప్పటికే దాని విపరిణామాల్ని పాక్ పలుమార్లు ఫేస్ చేసింది. అయినప్పటికీ దరిద్రులకు.. దుర్మార్గులకు.. దుష్టులకు ఆశ్రయం ఇస్తూ.. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు తన వంతు సాయాన్ని అందిస్తూనే ఉంది. ఇదే తరహాలో ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడి కారణంగా 40 మంది భారత వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో పాక్ దుర్నీతి.. ఉగ్రవాదంపై ఇమ్రాన్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే..పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేలా ఈ రోజు తెల్లవారుజామున పీవోకేలోని ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడుల్ని చేపట్టింది. ఈ ఉదంతంలో భారీ ఎత్తున ఉగ్రవాదులు మరణించినట్లుగా చెబుతున్నారు.
ఈ ఊహించని పరిణామానికి షాక్ కు గురైంది పాకిస్థాన్. నెమ్మదిగా కోలుకుంటే.. భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. భారత్ చేసిన దాడులకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. తమను ఎదిరించే సాహసం చేయొద్దంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఒక ప్రకటన విడుదల జారీ చేయటం గమనార్హం.
ఆకస్మిక దాడులతోకాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించినట్లుగా ఆయన పేర్కొన్నారు. భారత్ చర్యలకు తాము సరైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ దాడుల్ని ఖండిస్తూ పాక్ పెద్దల సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత్ లో త్వరలో ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో ఇలాంటి దాడులకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది.
ఈ దాడులతో పాక్ ఏ మాత్రం బెదిరిపోదని పెద్దల సభలోని నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ వారి మాటలే నిజమని అనుకుందాం. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. తాము పుల్వామాలో ప్లాన్ చేసిన ఉగ్రదాడికి తమ దేశం భారీ మూల్యం చెల్లించాలన్న చిన్న లాజిక్ ను పాక్ పాలకులు ఎలా మర్చిపోయారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. భారత్ మీద కన్ను వేసే ప్రయత్నం చేస్తే.. అందుకు తగిన రీతిలో బదులు తీర్చుకోవటం ఖాయమన్న విషయం గతం అనుభవంగా ఉన్నప్పటికీ బరితెగించిన పాక్.. ఇప్పుడు తరహాలోనే మాట్లాడుతుందని చెప్పక తప్పదు.