ఉప్పు నిప్పులా ఉన్న ఉత్తర - దక్షిణ కొరియా దేశాలు సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఒక్కటైన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో మొండి వాడనే పేరున్న ఉత్తరకొరియా రథసారథి కిమ్ తమ పక్కదేశంతో చర్చలు జరిపారు. ఇదే రీతిలో కీచులాటలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరున్న భారత్-పాకిస్థాన్ ల మధ్య కూడా చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి కోరిక ఉన్నది ఎవరికంటే...పాకిస్థాన్ మీడియాకు. ఉభయ కొరియాల మాదిరిగా భారత్-పాక్ లు కూడా చేతిలో చెయ్యి వేసి ఒక్కటి కావాలని.. తమ సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని పాకిస్థాన్ మీడియా ఆకాంక్షించింది. సహృద్భావ వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ప్రాంతీయంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులను సాధారణ స్థితికి తేవడంతోపాటు శాంతి స్థాపన - అత్యుత్తమ లక్ష్యాల సాధనకు పాటుపడాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది.
పాక్ లో ప్రధాన పత్రికల్లో ఒకటైన డాన్ ఈ మేరకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ రాసింది. `ఉభయ కొరియాల మధ్య శాంతి చర్చల పునరుద్ధరణ అంశాన్ని - దక్షిణాసియా ఉపఖండంలో నిలిచిపోయిన శాంతి ప్రక్రియతో అనివార్యంగా పోల్చాల్సి వస్తోంది. భారత్-పాక్ ల మధ్య ఉన్న వివాదాలు - ఉద్రిక్తతలు కొరియన్ దేశాలతో పోల్చినప్పుడు ప్రాథమికంగా భిన్నమైనవి` అని డాన్ ఎడిటోరియల్ పేర్కొంది.` భారత్-పాక్ లు విభిన్నమైన చరిత్రలను సృష్టించుకున్నాయి. కానీ కొరియాలు ఏకీకరణ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత్ - పాక్ మధ్య ఉమ్మడి చరిత్ర - ఆకాంక్షలు - శాశ్వతమైన సంస్కృతి - ఇతర సామ్యాలు అనేకం ఉన్నాయి` అని తెలిపింది.
ఇదిలాఉండగా... ఇదే ఒరవడిలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ సంయుక్తంగా సైనిక ప్రదర్శన ఇవ్వనున్నాయి. వచ్చే సెప్టెంబర్ లో రష్యాలో ఈ ప్రదర్శన జరుగనుంది. విన్యాసాల్లో చైనాతోపాటు పలు ఇతర దేశాలు కూడా పాల్గొననున్నాయి. నాటోకు వ్యతిరేకంగా చైనా ప్రాబల్య భద్రతా బృందాలను పెంచుకోవడంలో భాగంగా ఏర్పాటయిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరుగనుందని అధికారులు తెలిపారు. శాంతి మిషన్ - ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఎనిమిది ఎస్‌సీవో సభ్యదేశాల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. సైనిక ప్రదర్శనలో తాము పాల్గొంటామని భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం చైనాలో జరిగిన ఎస్ సీవో రక్షణశాఖ మంత్రుల సమావేశంలో చెప్పారని అధికారులు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాలు సంయుక్తంగా సైనిక ప్రదర్శన ఇవ్వనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.