ప్రధాని మోడీ గురించి విపక్షాలు తలో మాట అనేస్తుంటాయి. ఒకరేమో టూరిస్టు పీఎం అంటే.. మరొకరు ఎన్ ఆర్ ఐ ప్రధాని అంటూ విరుచుకుపడతారు. దేశీయంగా ఆయన చేస్తున్నదేముందని ప్రశ్నిస్తున్న వారు.. అంతర్జాతీయంగా ఆయన కదుపుతున్న పావులు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రపంచానికి పెద్దదిక్కులా వ్యవహరించే ఐక్యరాజ్యసమితిలో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేయటం ఒక విషయమైతే.. దానికి నాయకత్వం వహించటం చూసినప్పుడు మోడీ ధైర్యం చూసి మురిసిపోవాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో రెండో అతి పెద్ద దేశమైన భారత్ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానం లేకపోవటం పెద్ద లోటే. కానీ.. దీని గురించి పట్టించుకున్న నాథుడు లేడు. భద్రతా మండలిలో భారత్ కు స్థానం కల్పించాలంటూ వివిధ దేశాధినేతల చేత మొహమాటపు ప్రకటనలు చేయించటంతోనే తెగ సంబరపడిపోయే దానికి భిన్నంగా.. తాజాగా మోడీ వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయంగా కొత్త చర్చకు తావిచ్చేలా చేస్తుందని చెప్పాలి.
అమెరికా.. రష్యా.. చైనా.. బ్రిటన్ దేశాల అధిపత్యంలో భద్రతామండలి ఉండిపోవటం.. ఇందులో మిగిలిన దేశాలకు చోటు కల్పించాలన్న డిమాండ్ను పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవటం.. ఒకవేళ ఏ దేశాన్నైనా భద్రతామండలిలో చేర్చాలంటే ఈ నాలుగు దేశాల్లో ఏదో ఒక దేశం తనకున్న వీటో అధికారంతో మోకాలు అడ్డటం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. దీనికి చెక్ చెప్పేందుకు 2004లో జీ 4 దేశాలు (భారత్.. బ్రిజిల్.. జపాన్.. జర్మనీ) కూటమి ఏర్పడింది.
ఈ నాలుగు దేశాలకు భద్రతామండలిలో స్థానం కల్పించాలన్న డిమాండ్ దశాబ్దం తరబడి సాగుతున్నా ముందుకు కదిలింది లేదు. కానీ.. గతంలో ఏ భారత ప్రధాని చేయలేనంత సాహసం మోడీ చేసేశారు. భద్రతామండలిలో స్థానం దక్కించుకునేందుకు తాము అర్హులమని చెప్పటమే కాదు.. జీ4 దేశాధినేతల చేత చెప్పించటం విశేషం. ఒకవిధంగా చెప్పాలంటే మిగిలిన మూడు దేశాధినేతల నోట భద్రతామండలిలో స్థానం కల్పించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురావటంలో కీలకభూమిక పోషించారు.
ఆర్థికంగా.. జనాభా పరంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన భూమిక పోషిస్తున్న ఈ నాలుగుదేశాలకు భద్రతా మండలిలో స్థానం కల్పించకపోవటం ఏమిటంటూ సూటి ప్రశ్న సంధించటమే కాదు.. కాలం చెల్లిన విధానాల నుంచి బయటకు రావాలన్న మాటను అనేశారు. నిర్దిష్ట కాలపరిమితిని పెట్టుకొని భద్రతా మండలిలో శాశ్విత సభత్వం కల్పించే దిశగా అడుగులు వేయాలంటూ గట్టిగా తన వాదనను వినిపించిన.. మిగిలిన దేశాధినేతల చేత చెప్పించటంలో మాడీ కీలకభూమిక పోషించారనే చెప్పాలి.
భద్రతామండలిలో చోటు దక్కించుకోవటానికి తమ నాలుగు దేశాలకూ అన్ని అర్హతులు ఉన్నాయని చెప్పటం.. గత ప్రధానులంతా భారత్ ప్రాతినిధ్యం గురించి మాట్లాడేవారే కానీ.. తమతో మరో ముగ్గురిని వెంటబెట్టుకునే విషయంలో చేసిన తప్పుల్ని మోడీ సరిదిద్దటం కనిపిస్తుంది. మారిన ప్రపంచానికి తగ్గట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు కోసం గళం విప్పటం చూసినప్పుడు.. మోడీ మగాడ్రా అన్న మాట రాకుండా ఉండలేని పరిస్థితి. తన గురించి తాను చెప్పలేని గత ప్రధానులు కిందామీదా పడితే.. తన గురించి మాత్రమే కాదు.. తన స్నేహితుల గురించి అంతర్జాతీయ వేదిక మీద బలమైన వాణిని వినిపిస్తూ.. సరికొత్త వేగంతో దూసుకుపోతున్న మోడీని మెచ్చుకోకుండా ఉండలేం.