దేశ సరిహద్దుల్లో సైనికులు అహర్నిశలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని పహారా కాస్తుండడంతోనే మనమందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. దేశ రక్షణ కోసం అహోరాత్రాలు శ్రమించే సైనికులకు అత్యాధునిక ఆయుధాలు - యుద్ధ విమానాలు తదితరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ బడ్జెట్ లో సింహభాగం నిధులు రక్షణకు కేటాయిస్తుంది. భారీ సంఖ్యలో సైనికులు - అత్యంత శక్తమంతమైన అధునాతన ఆయుధాలు...కలిసి ఒక దేశాన్ని శత్రుదుర్భేద్యంగా ప్రపంచపటంలో నిలబెడతాయి. రక్షణ శాఖపై కేంద్రప్రభుత్వానికి ఉన్న ముందుచూపు వల్లే భారత సైనిక బలం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. తాజాగా, ప్రపంచంలోని శక్తివంతమైన సైనిక పాటవం గల దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2017 ప్రకటించిన జాబితాలో అమెరికా - రష్యా - చైనా ల తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవడం విశేషం. ఫ్రాన్స్ - జర్మనీ - యూకే - జపాన్ - ఇజ్రాయెల్ వంటి దేశాలన్నీ భారత్ కన్నా వెనుక ఉండడం విశేషం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 5 దేశాల్లో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.... భారత్ లో నిత్యం కయ్యానికి కాలుదువ్వే....దాయాది దేశం పాక్.....ఆ జాబితాలో 13 వ స్థానంలో నిలిచింది.
భారత ఆర్మీలో మొత్తం 13.62 లక్షల సైనికులు నిత్యం క్రియాశీలక విధులు నిర్వహిస్తున్నారు. భారత వైమానిక దళానికి 676 ఫైటర్ - 809 ఎటాక్ చోపర్లు - ఇతర విమానాలు కలిపి 2102 విమానాలున్నాయి. చైనా సైన్యంలో 37.12 లక్షల మందికి పైగా సైనికులున్నారు. చైనా వైమానిక దళంలో 1271 ఫైటర్ విమానాలు - 1385 ఎటాక్ ఎయిర్ క్రాఫ్టులు - 206 యుద్ధ హెలికాప్టర్లు - ఇతర విమానాలు కలిపి 2955 యుద్ధ విమానాలున్నాయి. భారత సైన్యానికి 4426 యుద్ధ ట్యాంకులు - 6704 ఆయుధ సహిత యుద్ధ వాహనాలు - 290 సెల్ఫ్ ప్రొఫెల్డ్ ఆర్టిలరీ గన్స్ - 7,414 ఫిరంగి తుపాకులు ఉన్నాయి. పాక్ దగ్గర మొత్తం 2924 యుద్ధ ట్యాంకులు - 2828 ఆయుధ సహిత వాహనాలు - 426 ఆర్టిలరీ గన్స్ - 3278 ఫిరంగి తుపాకులు ఉన్నాయి. చైనా దగ్గర 6457 ట్యాంకులు - 4788 యుద్ధ వాహనాలు - 1710 సెల్ఫ్ ప్రొఫెల్డ్ ఆర్టిలరీ గన్స్ - 6246 ఫిరంగి తుపాకులు ఉన్నాయి. ఆసియా దేశాల్లో భారత్ - పాక్ ల కంటే బలమైన శక్తిగా చైనా కొనసాగుతోంది.