రికార్డ్: 1న భారత్ లో ఎంతమంది చిన్నారులు పుట్టారంటే?

Update: 2020-01-02 09:31 GMT
కొత్త సంవత్సరం జనవరి 1న భారత్ రికార్డ్ సృష్టించింది. ఎందులోనంటారా? జననాల్లో.. అవును.. కొత్త ఏడాది ప్రారంభం రోజున భారతదేశంలో ఏకంగా 67,385 మంది శిశువులు జన్మించారట.. యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా జననాల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా జనవరి1న జన్మించే మొత్తం శిశువుల్లో 17శాతం భారత్ లో పుట్టారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ తెలిపింది. ఇది రికార్డ్ గా అభివర్ణించింది.

యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న 3,92,078 మంది జన్మించగా.. ఒక్క భారత్ లోనే 67,385 మంది పురుడు పోసుకోవడం విశేషం.

ఇక భారత్ తర్వాత స్థానాల్లో చైనాలో 46,299, నైజారియా 26039, పాకిస్తాన్ 16787, ఇండోనేషియా 13020, అమెరికా 10452 మంది జననాలతో నిలిచాయి.

ఇక కొత్త ఏడాది జనవరి 1న తొలి జననం ఫిజీ దేశంలో.. చివరి జననం అమెరికాలో జరిగింది.

కొత్త సంవత్సరం తమకు కలిసి వస్తుందని.. ఆరోజు మంచిదని చాలా మంది సిజేరియన్లు చేసుకొని మరీ ఈరోజు పిల్లలను కన్నారని తెలిసింది.
Tags:    

Similar News