అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాల నేపథ్యం లో అతి ఎక్కువ స్థాయిలో కలవరపాటుకు గురవుతున్న భారతీయ ఐటీ పరిశ్రమ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఇండియాకు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీల సీఈవోలు ఈ నెలలోనే అమెరికా వెళ్లనున్నారు. హెచ్-1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తున్నదన్న వార్తల నేపథ్యంలో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఫిబ్రవరి 20 నుంచి ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులు - చట్ట ప్రతినిధులను కలువనున్నట్లు నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వెల్లడించారు. ఒకవేళ అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తే వాళ్లకు కలిగే నష్టాలను వివరించాలని అనుకుంటున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. వాషింగ్టన్‌లో భారత్ సీఈవోల బృందం నాలుగు రోజుల పాటు పర్యటించనుంది. ఇప్పటికే ఇదే విషయమై భారత ప్రభుత్వంతో తాము చర్చించినా.. వ్యక్తిగతంగానే ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు.
దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ - టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా అమెరికా క్లయింట్లతో పనిచేయడానికి విదేశీ నైపుణ్యంపైనే ఆధారపడతాయి. అయితే హెచ్1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం వాటిని అరికట్టడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తయారుచేస్తున్నదన్న వార్తలు ఇండియన్ టెక్ దిగ్గజాలను ఆందోళనకు గురిచేశాయి. అదే జరిగితే ఆపిల్ లాంటి అమెరికా కంపెనీలతోపాటు విప్రోలాంటి ఇండియన్ కంపెనీలు కూడా స్థానిక అమెరికన్లకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఇదిలాఉండగా హెచ్1బీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధమవుతున్న సమయంలోనే అటు కాంగ్రెస్ కూడా హెచ్-1బీ వీసా బిల్లుపై చర్చించనుంది. ఈ అంశంపై జూన్ లో ప్రధాని మోదీ - ట్రంప్ మధ్య జరిగే సమావేశంలోనూ చర్చ జరగనున్నట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. టీసీఎస్ - ఇన్ఫోసిస్ - విప్రో - హెచ్ సీఎల్ - టెక్ మహీంద్రా - మైండ్ ట్రీలాంటి దిగ్గజ కంపెనీల సీఈవోలంతా ఈ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/