కొత్త వేరియంట్ గుర్తించిన భారతీయ శాస్త్రవేత్తలు....ప్రమాదం మరింతగా .. !
పుణే లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరో కొత్త కరోనా వేరియంట్ ను గుర్తించింది. యునైటెడ్ కింగ్ డమ్, బ్రెజిల్ నుంచి భారత్ కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో B.1.1.28.2 రకం వేరియంట్ గుర్తించినట్టు బయో ఆరెక్సివ్ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. వారి నమూనాలను సేకరించి జన్యు విశ్లేషణ ద్వారా ఈ కొత్త కరోనాను గుర్తించామని తెలిపారు. ఈ వేరియంట్ తీవ్రమైన కరోనా లక్షణాలను కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యాధికారక మూల్యాంకన ఫలితాలు పెరుగుతున్న వ్యాధి తీవ్రతను చూపుతుండగా, టీకా సామర్థ్యాన్ని పరీక్షించాల్సిన అవసరాన్ని చూపుతున్నాయి.
ఎన్ ఐవీ ప్రత్యేక అధ్యయనం ప్రకారం.. రెండు డోస్‌ల కొవాగ్జిన్ టీకా వల్ల గణనీయంగా యాంటీబాడీలు పెరగడంతో పాటు వేరియంట్ ను తటస్థీకరిస్తుంది. ఇక, B.1.1.28.2 వేరియంట్ వల్ల శరీర బరువు తగ్గడం, ఊపిరితిత్తుల్లో గాయాలు వంటి తీవ్రమైన వ్యాధికారకతకు కారణమైందని అధ్యయనం తెలిపింది. SARS-CoV-2 వేరియంట్ల జన్యు పర్యవేక్షణ, లక్షణాల అవసరాన్ని ఈ అధ్యయనం సూచించింది. రోగనిరోధక వ్యవస్థకు చిక్కుకుండా తప్పించుకునే సామర్థ్యం ప్రదర్శిస్తున్నట్టు పేర్కొంది. కొత్త వేరియంట్ తీవ్ర వ్యాధికారకత సామర్థ్యం పెంచుకునేలా మార్పుచెందగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ SARS-CoV-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియా కింద 10 జాతీయస్థాయి ల్యాబొరేటరీలు 30,000 నమూనాలను విశ్లేషించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల మరో 18 ల్యాబ్ లను కన్సార్టియంలో చేర్చారు. ఇదిలా ఉండగా, కొవిడ్‌పై పోరులో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. వైరస్‌కు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధకతను అవి ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించింది.