రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. విదేశీయులు కెనడా బంపరాఫర్..!

Update: 2022-11-15 01:26 GMT
గతేడాది కాలంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తోంది. ఈ రెండు దేశాలకు చెందిన అధ్యక్షులెవరూ కూడా వార్ పై వెనక్కి తగ్గకపోవడంతో ఇరుదేశాలకు చెందిన అమాయక ప్రజలు కోల్పోవాల్సి వస్తుండటం శోచనీయంగా మారింది. అయితే ఇదే సమయంలో కెనడా సర్కార్ విదేశీయులకు ఒక బంపరాఫర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

కెనడాలో పౌరసత్వం కలిగిన 18 ఏళ్లు నిండిన విదేశీయులకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తుంది. ‘ది స్కిల్డ్ మిలిటరీ ఫారెన్ అప్లికెంట్ ’ అనే కార్యక్రమం పేరిట విదేశీయులకు సైన్యంలో చేరేందుకు గతంలోనే అవకాశం కల్పించారు. వీటిలో తక్కువ శిక్షణ అవసరమయ్యే పైలట్లు.. డాక్టర్లు వంటి ఉద్యోగాలను విదేశీయులకు కల్పించారు. ఈ అవకాశాలను ప్రవాస భారతీయులు చక్కని అవకాశంగా వినియోగించుకుంటూ ఉపాధి పొందుతున్నారు.

అయితే ఇటీవల కాలంలో కెనడా సైన్యంలో చేరేందుకు అక్కడి యువత పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో సైన్యంలో చేరికలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే రష్యా-ఉక్రెయిన్ వార్ కొనసాగుతుండటంతో కెనడాలో సైన్యాన్ని మరింత పెంచుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కెనడా పౌరసత్వం కలిగిన 18 ఏళ్లు నిండిన విదేశీయులందరినీ తమ సైన్యంలో నియమించుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో భారతీయులకు మరింతగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కెనడా పౌరసత్వం కలిగి ఉండి 18ఏళ్లు నిండిన లేదా 16 ఏళ్లు నిండి తల్లిదండ్రుల అనుమతి ఉన్న వారికి కెనడా సైన్యంలో చేరేందుకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పించింది. పదో తరగతి లేదా 12వ గ్రేడ్ పూర్తి చేసుకున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కెనడా సర్కారు విదేశీయులను కోరుతోంది.

కొన్నాళ్లుగా కెనడా సైన్యంలో నియమకాలు తగ్గిపోయాయని ది కెనెడియన్ ఆర్మ్డ్ ఫోర్స్ గత సెప్టెంబర్ లో వెల్లడించింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులు అందుబాటులో లేరని పేర్కొంది. రాబోయే రోజుల్లో నెలకు 5 వేల 900 మంది చొప్పున నియమకాలు చేపడితే తప్ప సైన్యం అవసరాలు తీరవని కెనెడియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది.

ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ఈ ఏడాది నుంచి కెనడాలో వలసలు ప్రోత్సహించాలని నిర్ణయించారు. 2023-25 నాటికి ఏకంగా 5 లక్షల మంది వలసదారులకు కెనడా తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని భావిస్తుందని అనితా ఆనంద్ వెల్లడించారు. ఏదిఏమైనా ఈ కొత్త అవకాశాన్ని భారతీయులు ఏమేరకు అంది పుచ్చుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News