అమెరికన్ సర్వేలో మోడీకి ఏ గ్రేడ్

Update: 2015-09-19 05:56 GMT
    నరేంద్ర మోడీ ప్రజాదరణ విషయంలో ఇండియాలో చేసిన సర్వేలకు భిన్నంగా అమెరికన్ సర్వే ఒకటి మోడీకి మంచి మార్కులేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంతో పోల్చుకుంటే మోడీ ప్రజాదరణ రోజురోజుకీ తగ్గిపోతోందని ఇండియాలోని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయ డంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కూడా ప్రజలు అంటున్నారని సర్వేలు ఘసిస్తున్నాయి. నల్లధనం దేశానికి రప్పిస్తాం అన్న విషయంలోనూ ప్రధాని మోదీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోతున్నారని ఆ సర్వేలు వెల్లడించాయి. అయితే అమెరికాకు చెందిన సంస్థ ''వ్యూ'' చేసిన సర్వేలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. దేశంలోని 87 శాతం మంది ప్రజలు ఇప్పటికీ మోడీకి అనుకూలంగానే ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ మోడీ పట్ల ఆదరణ ఉందని... ఆయన ప్రభ వెలిగిపోతోందని ఆ సంస్థ సర్వే తేల్చిచెప్పింది.

మోడీ విధానాలు, పాలన కారణంగా ప్రజల్లో ఆయనపట్ల ఆదరణ పెరుగుతోందని... 87 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఉందని వ్యూ సర్వే పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి మే 19 మధ్య 2,452 మంది భారతీయుల అభిప్రాయాలు సేకరించి 'వ్యూ' ఈ సర్వే చేసింది.

సర్వేలో ముఖ్యాంశాలు..

- దేశంలోని కాంగ్రెస్ మద్దతుదారులు, అనుకూలురులో అధికులు మోడీ పట్ల సానుకూలంగానే ఉన్నారట. టెర్రరిజం, అవినీతిలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలపై 56 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు.

- స్వచ్ఛభారత్ విషయంలో 66 శాతం.. నిరుద్యోగ సమస్యను డీల్ చేయడంపై 62.. పేదల కోసం పనిచేయడంపై 61... ద్రవ్యోల్బణం విషయంలో 61 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు.

- కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కంటే మోడీ దేశంలో పాపులర్ నేత అని ఈ సర్వే తే్ల్చింది.

Tags:    

Similar News