వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ క్రమంగా తొలగిపోతోంది. ఇప్పటికే అన్ లాక్ -1 అమలు చేస్తున్నారు. ఇప్పుడు జూన్ నెలాఖరు వరకు విధించిన లాక్ డౌన్-5 పాక్షికంగా కొనసాగుతోంది. ఇప్పుడు అన్ లాక్ -2 అమలు యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఒక్కటి మినహా అన్ని రంగాలు తెరచుకోనున్నాయి. ఆ ఒక్కటే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ.
ఈ సేవలను మినహాయించి త్వరలోనే అన్‌లాక్ 2 అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియలో మరెలాంటి మార్పులు ఉండకపోవచ్చునని కేంద్ర అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఇటీవల ప్రతిపక్షాల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో దశలవారీ లాక్ డౌన్ ముగిసిందని.. అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని ప్రకటించారు. జూన్ 30వ తేదీతో అన్‌లాక్ 1 ముగుస్తుండటంతో.. అన్‌లాక్ 2లో కేంద్రం సడలింపులు ఏవేవో ఇస్తుందోనని ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ ఉధృతి.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడం వంటి నేపథ్యంలో అన్‌లాక్ 2 మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు మరికొన్ని రోజులు తెరిచే అవకాశమే లేదు. అవి ఇంకొన్నాళ్లు మూసివేసే ఉండనున్నాయి.
దేశంలో సుమారు 85 శాతం కేసులు ప్రధాన నగరాల్లోనే నమోదవుతుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్‌లాక్ 2లో అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 15 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నిలిపేసినప్పటికీ.. కొన్నింటిని ప్రాతిపదికన అనుమతించవచ్చని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ చెప్పిన సంగతి విదితమే. అన్‌లాక్ 1.0, అన్‌లాక్ 2.0 మార్గదర్శకాల మధ్య తేడా ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రదేశాల్లో మాల్స్ సైతం తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్ 2.0లో కేంద్రం మాత్రం ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది.