కాశ్మీర్ పై ఆల్ ఖైదా గురిపెట్టిందా ?

Update: 2022-05-31 05:30 GMT
ఎలాగైనా కాశ్మీర్ ను హస్తగతం చేసుకునేందుకు దాయాది దేశం పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. భారత్ నుంచి కాశ్మీర్ ను విడగొట్టి తమ దేశంలో కలుపుకునేందుకు పాకిస్థాన్ పాలకులు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ఇపుడు తాజాగా కాశ్మీర్ లో మరింతగా అల్లకల్లోలం, మారణహోమం సృష్టించేందుకు ఆల్ ఖైదా కూడా యాక్టివైనట్లు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో బయటపడింది.

నివేదిక ప్రకారం ఉగ్రమూకలకు ఆఫ్గనిస్ధాన్లో తాలిబన్లు, ఆల్ఖైదా సంయుక్తంగా శిక్షణిస్తున్నట్లు బయటపడింది. బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్తాన్ నుండి ఆల్ ఖైదా యువకలను రిక్రూట్ చేసుకుంటున్నదట.

వీరందరికీ తమదేశంలోని ఘజ్ని, హెల్మంద్, కాందహార్, నిమ్రుజ్, జబూల్ ప్రావిన్సుల్లో కఠోరమైన శిక్షణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి శిబిరంలోను ఆల్ ఖైదా సుమారు 200 మందిని ఉంచి బాంబులు తయారుచేయటం,  బాంబులు పేల్చటం, తుపాకులు ఉపయోగించటం, సెల్ఫ్ డిఫెన్స్ లో గట్టి విక్షణిస్తోంది.

శిక్షణా కాలం కూడా ఆరు మాసాల నుండి ఏడాది వరకు ఉంటోందని నివేదికలో స్పష్టంగా ఉంది. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లకు, ఐఎసిస్ ఉగ్రమూకలకు మధ్య చాలా దాడులే జరిగాయి. ఎందుకంటే తాలిబన్లు పాకిస్ధాన్ నియంత్రణలో పనిచేస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇదే ఐఎసిస్ ఉగ్రసంస్ధ స్వతంత్రంగా పనిచేయటంతో పాటు పాకిస్ధాన్ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకనే అంటే పై రెండు మూకలు చేసుకున్న పరస్పర దాడుల కారణంగా రెండువైపులా భారీ నష్టాలు జరిగాయి. దాంతో ఇరువైపుల నాయకత్వం మేల్కొని పరస్పర దాడులకు దిగకూడదని ఒప్పందానికి వచ్చాయి.

అదే సమయంలో ఇద్దరు కలిసి భారత్ లోని కాశ్మీర్ టార్గెట్ గా పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యాయి. ఎలాగే దీనికి పాకిస్ధాన్ నుండి అందుతున్న నిధులు, ఆఫ్గన్ నుండి ప్రపంచదేశాలకు ఎగుమతవుతున్న మాదకద్రవ్యాల ద్వారా వస్తున్న నిధులు ఉండనే ఉన్నాయి. అందుకనే ఉగ్ర తయారీ శిబిరాలను నిర్వహించి కాశ్మీర్ మీదకు ప్రయోగించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాయి. మరి ఈ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News