సర్వే: మోడీ ఫెయిల్యూర్.. హర్షవర్ధన్ బలిపశువా?

Update: 2021-07-09 10:18 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే కాబోలు.. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ వైఫల్యాలకు తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయ మంత్రి హర్షవర్ధన్ బలైపోయాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సర్కార్ కరోనా వేళ ఎంత ఫెయిల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా నెపాన్ని మొత్తం మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పై నెట్టేసి కేబినెట్ నుంచి తప్పించారని ప్రజలలో చర్చ సాగుతోంది.

'ఐయాన్స్-సీఓటర్' స్నాప్ పోల్ తాజాగా కేంద్రమంత్రివర్గ మార్పులపై సర్వే నిర్వహించింది. ఇందులో కోవిడ్19 మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు హర్ష్ వర్ధన్ మాత్రమే బాధ్యత వహించలేరని.. ఆయనను బలిపశువుగా చేశారని దాదాపు సగం మంది 54శాతం పైగా చెప్పడం గమనార్హం.దాదాపు 1200 మందిని అన్ని విభాగాలలోని వయోజన ప్రతివాదుల అభిప్రాయాలను ఈ సర్వేలో తీసుకున్నారు. అయితే 29శాతం మంది మాత్రం హర్షవర్ధన్ దే తప్పు అని చెప్పడం విశేషం.

ఇక కేంద్ర కేబినెట్ పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గిస్తుందా? ఉపశమనం లభిస్తుందా? అనే ఆశలు మాత్రం జనాలకు లేవు అని కుండబద్దలు కొట్టారు. పెట్రోలియం మంత్రిని మార్చడం.. హర్దీప్ పూరిని నియమించడం వల్ల పెట్రోల్ ధరలు ఏమీ తగ్గవని 50శాతం మంది చెప్పారు. 34శాతం మంది మాత్రం పెట్రోల్ ధరలు తగ్గొచ్చు అని అభిప్రాయపడ్డారు.

ఇక కొత్త విద్యాశాఖ మంత్రి వల్ల దేశంలో విద్యాస్థితిని మెరుగుపరుస్తుందని 52శాతం మంది చెప్పగా.. 35శాతం మంది అలాంటిదేమీ ఉండదని కుండబద్దలు కొట్టారు.మోడీ ప్రభుత్వంలో బుధవారం నిర్వహించిన కేబినెట్ ప్రక్షాళన సీనియర్ మంత్రులంతా ఎగిరిపోయారు. కొత్త వారికి కీలకమైన శాఖలు దక్కాయి. కేంద్ర సీనియర్ మంత్రుల రాజీనామాలు మాత్రం ఎవరూ ఊహించనివి అని అంటున్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ లో నిర్లక్ష్యం.. సరిగా పనిచేయలేదనే కారణంగా ఆరోగ్య మంత్రి  హర్షవర్ధన్ ను బలిపశువు చేశారని.. నిజానికి ఈ పాపంలో మోడీది భాగస్వామ్యం ఉందని అంటున్నారు. మిలియన్ల మంది ప్రాణాలు పోయిన దానికి కేవలం ఆరోగ్యమంత్రిని మాత్రమే ఎలా బలి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ పరిస్థితి.. నిర్వహణ, వ్యాక్సిన్ పంపిణీ మొత్తం ఆరోగ్యమంత్రిత్వశాఖ చేసినా కీలక నిర్ణయాలన్నింటిని మోడీయే సమీక్షించి చేశారు. మరి ఈ విషయంలో ఒక్క ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నే ఎందుకు తొలగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News