సభా సంఘం వేయటం బాబుకే మంచిదా ?

Update: 2022-03-22 09:30 GMT
చంద్రబాబు నాయుడు హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించారన్న ఆరోపణలపై సభా సంఘం వేయటం మంచిదే. సభాసంఘం వేయడం ద్వారా చంద్రబాబు హయాంలో ఏమి జరిగిందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది. తమ హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని ఇప్పటికే లోకేష్ స్పష్టంచేశారు. లేదు లేదు సాఫ్ట్ వేర్ ను కొన్నారని మంత్రులు, ఎంఎల్ఏలంటున్నారు. సాఫ్ట్ వేర్ కొనలేదనటానికి లోకేష్ మాటే ఆధారం.

అయితే సాఫ్ట్ వేర్ కొన్నారనటానికి ఆధారం ఉండాలి కదా? బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలే ఆధారంగా మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడుతున్నారు.

అయితే మమత ఆరోపణలు నిలబడవు. కొన్నారనేందుకు రికార్డులను ఆధారాలుగా ప్రభుత్వం చూపగలగాలి. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఏమి కొనాలన్నా అందుకు చెల్లింపులు చేయాలన్నా పెద్ద ఫైల్ రన్ అవ్వాల్సిందే. అలాంటి ఫైళ్ళే ఇపుడు ఆధారాలుగా ప్రభుత్వం చూపాల్సుంటుంది.

అవి లేనపుడు ప్రభుత్వం చేసే ఆరోపణలు నిలబడవు. ఇపుడు వేయబోయే సభా సంఘం మాత్రం ఏమి నిరూపణ చేయగలుగుతుంది? చంద్రబాబు నిజంగానే పెగాసస్ కొనుంటే ఇపుడు కొత్తగా సభాసంఘం అవసరమే ఉండదు. ఎందుకంటే పోలీసు శాఖలోనో లేదా ఇతరత్రా శాఖల్లోనే చెల్లింపులకు సంబంధించిన ఫైల్ ఉండితీరాలి. నిజంగానే అలాంటి ఫైల్ ఉండుంటే మమత ఆరోపణల వరకు ప్రభుత్వం ఎందుకు వెయిట్ చేస్తుంది .

ఇక అనధికారికంగా పెగాసస్ కొన్నారనేందుకు ఆస్కారముంది. అయితే లాజిక్కుకు నిలవదు. కాబట్టి ఏ  యాంగిల్లో చూసుకున్నా చంద్రబాబు పెగాసస్ కొన్నట్లు నిరూపణయ్యే అవకాశం లేదనే అనిపిస్తోంది. అందుకనే సభాసంఘం వేయటం చంద్రబాబుకే మంచిది. ఆరోపణలను నిరూపించలేనపుడు ఎన్ని సభా సంఘాలను వేస్తే మాత్రం ఏమిటి ఉపయోగం?

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ నుండి పరికరాలు కొన్నారన్న విచారణే మూడేళ్ళుగా నత్తనడక నడుస్తోంది. ఇక చంద్రబాబు మీద ఆరోపణలను ప్రభుత్వం ఏమి తేల్చగలదు?
Tags:    

Similar News