వయసు రీత్యా అయితేనేమీ..? ఫామ్ కారణంగా అయితేనేమీ..? ఇతర ప్రాధామ్యాలు ఉండడం కారణంగా అయితేనేమి..? కొందరు ఆటగాళ్లను వచ్చే ఐపీఎల్ లీగ్ (16వ ఎడిషన్) లో చూడలేమని చెప్పొచ్చు. వీరిలో అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది మహేంద్ర సింగ్ ధోని గురించి.. ఉన్నట్లుండి రెండు రోజుల కిందట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదిలేశాడు ధోని. అదీ లీగ్ ప్రారంభానికి రెండు రోజుల ముంగిట. అలాగే.. ధోనికి ఇది చివరి సీజన్ అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చడీచప్పుడు లేకుండా మధ్యలోనే వైదొలగినా ఆశ్చర్యం లేదు. నేటి నుంచి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరెవరు చివరిసారిగా లీగ్ లో పాల్గొనబోతున్నారో చూద్దాం...?
1) విండీస్ మిస్టరీ స్పిన్నర్ నరైన్కోల్ కతా నైట్ రైడర్స్ విజయాల్లో విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ది కీలకపాత్ర. బంతితోనే కాదు.. బ్యాట్ తోనూ భారీ షాట్లు ఆడుతూ జట్టును గెలిపించాడు నరైన్. అంతేకాదు.. లీగ్ లోనే అత్యంత ప్రమాదకర బౌలర్ నరైన్. కానీ, కొన్నాళ్లుగా తన బౌలింగ్ లో మిస్టరీ మిస్సయింది. మునుపటి వాడి కనిపించడం లేదు. దీనికితోడు నరైన్ వయసు 33. దాదాపు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు కూడా వేధిస్తున్నాయ్. దీంతో, సునీల్ నరైన్ కి ఇదే చివరి సీజన్ అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
2) భారత టెస్టు క్రికెటర్ రహానే..అజింక్య రహానే.. ఈ ముంబై క్రికెటర్ ది విచిత్రమైన పరిస్థితి. అంతర్జాతీయ అరంగేట్రం టి20 లతోనే ప్రారంభించిన రహానే.. వన్డేల్లోనూ స్థిరంగా రాణించాడు. కానీ, టెస్టు క్రికెటర్ గా ముద్రపడ్డాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా ఎదిగినా ఫామ్ కోల్పోయి ఇప్పుడు జట్టులో చోటే కోల్పోయాడు. ఢిల్లీ, రాజస్థాన్, పుణె.. ఇలా జట్లన్నీ మారి ఇప్పుడు కోల్ కతాకు ఆడనున్నాడు. సరిగ్గా 11ఏళ్ల కిందట ఇంగ్లండ్ పై టి20లో అరంగేట్ర మ్యాచ్ లోనే 70 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానే క్లాస్ బ్యాటింగ్ ఇప్పుడు దేనికీ పనికిరానిదిగా మారింది. రంజీ ట్రోఫీలో ఒక సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు అనుకునే లోపు ఆ వెంటనే తన చెత్త షాట్లతో మళ్లీ విఫలమయ్యాడు. ఐపీఎల్ వేలంలో రహానేను బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే దక్కించుకుంది కేకేఆర్. ఈ ఏడాది ఐపీఎల్ లో సరిగ్గా రాణించకపోతే.. అతన్ని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. దీంతో, జింక్స్ కు ఇదే లాస్ట్ ఐపీఎల్ అయ్యే ఛాన్సుంది.
3) కర్ణ్ కూ ఇదే ఆఖరుఉత్తరప్రదేశ్‌కి చెందిన 34 ఏళ్ల కర్ణ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2009 సీజన్‌లో ఆర్సీబీకి ఎంపికై సన్‌రైజర్స్ (2013-16), ముంబై ఇండియన్స్ (2017), చెన్నై సూపర్ కింగ్స్ (2018-2021) జట్లకు ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. కర్ణ్ తన ఐపీఎల్ కెరీర్‌లో 68 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు, 15.1 బ్యాటింగ్ సగటుతో 316 పరుగులు చేశాడు. కర్ణ్ శర్మ టీమిండియా తరఫున ఓ టెస్ట్,2 వన్డేలు, ఓ టీ20లో 5 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతని బౌలింగ్ లో మునుపటి వాడి కన్పించడం లేదు. దీంతో ఈ లెగ్ స్పిన్నర్ కి ఇదే లాస్ట్ సీజన్ అయ్యే అవకాశం ఉంది.
4) విఫల అరోన్ అద్భుత వేగంతో బంతులేసి.. బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టి 2011లో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఎంత వేగంగా వచ్చాడో.. అదే స్పీడుతో కనుమరగమయ్యాడు వరుణ్ అరుణ్. అడపా దడపా ఐపీఎల్ మ్యాచులాడుతూ ఒకటి రెండు చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఇతడిని రూ.50 లక్షలతో టైటాన్స్ దక్కించుకుంది. అయితే, మైదానంలోకి దిగే దాకా అరోన్ ఫిట్ నెస్ పై సందేహాలే. కాబట్టి ఈ పొడగరి ఇదే ఆఖరి సీజన్.
5) ఉతప్ప.. తప్పదప్పా..2006-2007 లో అద్భుత బ్యాటింగ్ తో వెలుగులోకి వచ్చాడు రాబిన్ ఉతప్ప. నాడు భవిష్యత్ ఆశా కిరణంగా కనిపించాడు. 2007 ప్రపంచకప్ లోనూ ఆడాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడినా.. నిలకడ లేక జట్టుకు దూరమయ్యాడు. 36 ఏళ్ల రాబిన్ ఊతప్పను మెగా వేలంలో సీఎస్‌కే రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఊతప్ప టీమిండియా తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. గతంలో కోల్‌కతా నైట్స్ రైడర్స్ తరుపున బరిలోకి దిగిన ఉతప్పు..గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫునఆడాడు. 2014 నుంచి 2017 సీజన్లలో కోల్‌కతా ఆడుతూ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. గతేడాది.. ఆఖర్లో జట్టులోచోటు దక్కించుకుని మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది రాణిస్తే తప్ప. .వచ్చే సీజన్ లో ఊతప్పను చూడటం కష్టమే.