రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ కంటే కేటీఆర్ కే ప్రజాధరణ ఉందట. కేటీఆర్ ను కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 70 నుంచి 80 శాతం వరకు యాంటి కేసీఆర్ అనే సెంటిమెంట్ తో ఓట్లు పడుతాయని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని నివేదిక అందింది. అయితే కేసీఆర్ సొంతంగా సర్వే చేయించారు. ఈ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడ్డాయట. ఇందులో కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలినట్లు కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయతే ప్యూచర్లో కేటీఆర్ సీఎం అవడం ఖాయమేనా..? అన్న చర్చ సాగుతోంది.
ఓ ఛానెల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేశారు. కేసీఆర్ పై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, దీంతో ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అనవసరంగా పెట్టుకుంటన్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఎన్ని సర్వేలు చేయించినా కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఇప్పుడు అదే సెంటిమెంట్ వ్యతిరేకంగా మారిందని ఆయన అన్నారు.
గత కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేస్తున్నారు. కేంద్రంపై పోరు అంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులపై శ్రద్థ పెట్టడం లేదు. 57 ఏళ్ల పింఛన్ అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ఇచ్చింది లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెప్పిన ఆయన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పూర్తి చేసి పంపిణీ చేశారు.
మరోవైపు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరి వద్దంటూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ... రకరకాల కారణాలు చెబుతున్న ఆయన రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు.
ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా.. రాష్ట్రంలో పరిస్థితులు అలాగే ఉన్నాయని పీకే నివేదికలో తెలిపినట్లు సమాచారం. అయితే కేసీఆర్ మరోసారి సొంత సర్వేచేయించినా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ కంటే కేటీఆర్ పై ఆదరణ పెరుగుతోందని అంటున్నారు. అయితే కేటీఆర్ పై కూడా పట్టణ, నగర ప్రాంతాల్లోనే అభిమానులు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పేరెత్తడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనడం సంచలనంగా మారింది.
ఇక ప్రస్తుతం కేసీఆర్ ఒత్తిడిలో ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సర్వే రిపోర్టులను చూసిన ఆయన తీవ్రంగా మనస్థాపం చెందారని అంటున్నారు. అయితే మొన్నటి వరకు జాతీయ రాజకీయాలని హడావుడి చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తామన్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతం ఆ ఊసెత్తడం లేదు. ఇటు వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లు రావడంతో మోటార్లు చెడిపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది కష్టమేనని లోక్ సభలో ఓ మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పిన మాటల్లో తెలుస్తోంది.
Full View