తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. ఆ లక్ష్యాన్ని సాధించి తెలంగాణ అధికారపక్షంగా మారి గడిచిన తొమ్మిదేళ్లుగా అధికారపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాను అధికారంలోకి వచ్చినంతనే తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే లక్ష్యమన్న ఆయన.. ఆ ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లుగా ప్రకటించటం తెలిసిందే. దసరా పండుగ వేళ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న వైనంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.
మిగిలిన వారి కంటే ఘాటుగా రియాక్టు అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డి. భారత రాష్ట్ర సమితి పేరుతోజాతీయ పార్టీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆస్తిత్వాన్ని చంపేశారన్నారు. 'వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తో రుణం తీరిపోయింది.
అందుకే తెలంగాణ అనే పదం కనిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కుటుంబ తగాదాల పరిష్కారం.. రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ ను తీసుకొచ్చారు.
తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగం. ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్. తెలంగాణ హంతకుడ్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా' అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పోటీ చేయటానికి కేసీఆర్ కు అర్హత లేదని.. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలన్న ఫైర్ బ్రాండ్ రేవంత్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని రోజుల తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి అన్న పేరు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతం అయ్యారు. కేసీఆర్ విక్రత ఆలోచనలకు పరాకాష్ట బీఆర్ఎస్'అని ఫైర్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.