స‌ల‌స‌ల మండే నీళ్ల‌ల్లో వేసి చంపేశారు

Update: 2016-07-07 04:27 GMT
అంద‌రూ చూస్తుండ‌గా త‌ల‌లు న‌ర‌క‌డం.. AK 47ల‌తో శ‌రీరాల్ని ఛిద్రం చేయ‌డం.. ఎత్త‌యిన భ‌వ‌నాల నుంచి కిందికి తోసేయ‌డం.. ఇలా ఐసిస్ అరాచ‌కాలు ఎన్నెన్నో. ఇప్పుడు వాళ్ల శాడిజం మ‌రో టర్న్ తీసుకుంది. స‌ల స‌ల మ‌రుగుతున్న నీటిలో మ‌నుషుల్ని తోసేసి వారు విల‌విల‌లాడి ప్రాణాలు కోల్పోతుండ‌గా చూసి పైశాచికానందాన్ని పొందుతున్న ఐసిస్ ఉగ్ర‌వాదుల్ని చూస్తే ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం. తమ మాట వినని జిహాదీలకు ఇలాంటి శిక్షే విధిస్తున్నారు ఐసిస్ ఉగ్ర‌వాద నేత‌లు.

ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది. త‌మ ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొందిన జిహాదీల‌కే ఇలాంటి దారుణ‌మైన శిక్ష‌లు విధించింది ఐసిస్‌. ఇరాక్.. సిరియాల్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్.. ఆ దేశాల భద్రతా దళాలతో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల కింద‌ట బాగ్దాద్ స‌మీపంలోని లాహుద్దీన్ ప్రావిన్స్ లో ఇరాకీ సైనికుల‌కు.. ఐసిస్ ఉగ్ర‌వాదుల‌కు పోరు జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఏడుగురు ఉగ్ర‌వాదులు.. సైనికుల‌తో పోరాడ‌కుండా మ‌ధ్య‌లో విర‌మించి వెళ్లిపోయారు. త‌మ ఆదేశాలు పాటించ‌కుండా ఇలా పారిపోయినందుకు ఆ ఏడుగురికి దారుణ‌మైన శిక్ష‌లు విధించారు ఐసిస్ నాయ‌కులు.బహిరంగ ప్రదేశంలో పొయ్యి ఏర్పాటు చేసి.. దానిపై భారీ గిన్నెలో నీళ్లు మరిగించి.. ఒక్కొక్క‌రిని అందులోకి వేసి మ‌రిగించి చంపేశారు. ఐసిస్ ముష్క‌రులు ఇలాంటి శిక్ష‌లు అమ‌లు చేయ‌డం ఇదే తొలిసారి. గత నెల 19 మంది జిహాదీలను తుపాకిల‌తో కాల్చిచంపారు. మేలో 25 మంది అనుమానిత గూఢచారులను నైట్రిక్ యాసిడ్ లో ముంచి చంపారు. సిరియాలో పట్టుపడ్డ ఐదుగురు జర్నలిస్టులను గ‌త నెలే పీలక‌లు కోసి హ‌త‌మార్చారు.
Tags:    

Similar News