భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాలతో భారత్ కీర్తిప్రతిష్టలను ప్రపంచ దేశాల్లో పెంచింది. అతి తక్కువ ఖర్చుతోనే భారీ ప్రయోగాలను నిర్వహిస్తూ తన సత్తా చాటింది. తద్వారా వివిధ దేశాలు సైతం తమ ప్రయోగాలకు ఇస్రోపైనే ఆధారపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ఇస్రో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి ఏకంగా 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి మరో రికార్డును అందుకోనుంది. ఈ క్రమంలో బ్రిటిష్ స్టార్టప్ కంపెనీ 'వన్ వెబ్' సంస్థకు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ద్వారా ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రయోగం జరుగుతుంది.
కాగా 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించనున్నాయి.
ఈ మేరకు 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ వెబ్, ఎన్‌ఎస్‌ఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ సంస్థ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్‌టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్‌వే కావడం గమనార్హం.
వాస్తవానికి గతంలోనే ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉండగా పలు కారణాలతో ఇస్రో వాయిదా వేస్తూ వచ్చింది. కాగా ప్రయోగించనున్న 36 ఉపగ్రహాలు ఒక్కొక్కటి 150 కిలోల బరువు కలిగి ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.