వాటాలు అడిగిన ఎమ్మెల్యే - తీవ్రంగా వారించిన సీఎం జగన్

Update: 2019-09-12 14:30 GMT
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ఒక సంస్థ నుంచి భారీగా ముడుపులను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ఒక భారీ పరిశ్రమ నుంచి కొన్ని కోట్ల రూపాయలను డిమాండ్ చేశారట. అయితే అంత ముడుపులు ఇచ్చుకోలేని ఆ సంస్థ ఈ విషయాన్ని డైరెక్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం.

అవినీతి రహిత పాలన విషయంలో జగన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో తెలిసిన సంగతే. ఇలాంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేపై వచ్చిన కంప్లైంట్ ను జగన్ పరిశీలించినట్టుగా తెలుస్తోంది. దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఆ ఎమ్మెల్యే డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

గతంలో తెలుగుదేశం పార్టీలో అక్కడ ఎమ్మెల్యేలకు సదరు సంస్థలు డబ్బులు  ఇచ్చుకునేవాట. ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగాలని.. తనకు వాటాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.  అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్టుగా సమాచారం. ఆ కంపెనీ నుంచి ఫిర్యాదు  అందిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది.

జాగ్రత్తగా నడుచుకోవాలని.. చెడ్డ పేరు తెచ్చుకోవద్దని.. జగన్ హెచ్చరించినట్టుగా టాక్. దీంతో ఆ ఎమ్మెల్యే కూడా దారికి వచ్చారట. భారీగా డబ్బులు డిమాండ్ చేసిన ఆయన ముఖ్యమంత్రి హెచ్చరికతో వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News