జ‌గ‌న్ స‌ర్కారు మ‌రిన్ని తాయిలాలు.. రీజ‌న్ ఇదే గురూ..!

Update: 2022-12-31 06:52 GMT
వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్ పై ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. వివిధ విభాగాల‌కు చెందిన అధికారులు స‌హా..వివిధ రంగాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త‌ల‌తో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వ‌రుస భేటీల‌కు రంగం సిద్ధం చేశారు. 2023-24 బ‌డ్జెట్ అత్యంత కీల‌క‌మ‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి  స‌మాచారం అందింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్ అనే చెప్పాలి. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక‌లు జ‌రిగితే.. 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. అలా చూసుకుంటే, 2024 మార్చిలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టినా.. అది ఓటాన్ అకౌంట్ అంటే.. స్వ‌ల్ప‌కాలిక బ‌డ్జెట్‌కే ప‌రిమితం అవుతుంది. ఇలా చూసుకుంటే ఇప్పుడు ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్ ఏదైతే ఉంది..అది మాత్ర‌మే ఎన్నిక‌ల బడ్జెట్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే వ్యూహాన్ని ఈ బ‌డ్జెట్‌లో నింపేయ‌నున్నార‌నేది చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అంటే.. ఈ బ‌డ్జెట్‌.. ఎన్నిక‌ల తాయిలాల సువాస‌న‌ల‌తో ఘుమాయించ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు..  గతేడాది 2 లక్షల 56 వేల256 కోట్లతో బడ్జెట్  ప్ర‌వేశ‌పెట్టారు. ఇక‌, 2023-24 బ‌డ్జెట్‌ను ఏకంగా 2.75 లక్షల కోట్లతో ఉంటుంద‌ని ఆర్థిక వ‌ర్గాలు చెబుతున్నాయి.

అంటే..రానున్న బ‌డ్జెట్‌లో సుమారు 20 ల‌క్ష‌ల కోట్లు అద‌నంగా కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి సంక్షేమానికి మ‌రింత ఎక్కువ కేటాయింపు ఉండ‌నున్నాయి.

అదేవిధంగా జ‌గ‌న‌న్న ఇళ్ల‌ను పూర్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆర్ఎండ్ బీకి కేటాయింపుల వ‌ర‌ద పార‌నుంద‌ని తెలుస్తోంది. ఇక‌, విద్య‌క‌న్నా ఆరోగ్య శ్రీని ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అస్త్రంగా మ‌లుచుకునే క్ర‌మంలో వైద్య రంగానికి కేటాయింపులు ఎర‌గ‌నున్నాయి.

అలాగే వివిధ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్పిన‌ట్టుగానే  ఇరిగేషన్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. 2023-24 బ‌డ్జెట్ పూర్తిగా ఎన్నిక‌ల బ‌డ్జెట్ అనే అంటున్నారు మేధావులు. ఎలా చూసుకున్నా.. ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్ అనే అంటున్నారు. మ‌రి ఎలా ఉంటుందో చూడాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News